Site icon vidhaatha

ఈ నెల‌లో మ‌హేష్ ఇంట శుభ‌కార్యం.. గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ, ద‌గ్గుబాటి ఫ్యామిలీల‌కి ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న విష‌యం తెలిసిందే. వారి ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్ష‌న్ జ‌రిగిన కూడా అది హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్‌గా ద‌గ్గుబాటి వారింట శుభ‌కార్యం జ‌ర‌గ‌గా, నవంబ‌ర్‌లో మెగా ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొన‌నుంది. ఇక ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో కూడా ఈ నెల ఓ శుభ‌కార్యం జ‌ర‌గ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. కృష్ణ వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోగా మారిన మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తాడు.

చిన్న గ్యాప్ దొరికితే ఫ్యామిలీని ఫారెన్ తీసుకెళ్లి అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. అయితే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా త్వ‌ర‌లో సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వెండితెర ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన కూడా ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది. రీసెట్‌గా సితార ప్రముఖ జ్యులరి కంపెనీ యాడ్ లోనూ నటించి భారీ పారితోషికం అందిపుచ్చుకుంది. వచ్చిన మొత్తాన్ని చారిటీకి అందించి అందరి మ‌న‌సులు గెలుచుకుంది. ఇక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ సంద‌డి చేస్తుంటుంది సితార‌. అయితే ఇప్పుడు సితార‌కి సంబంధించిన ఓ వేడుక‌ని భారీ ఎత్తున ప్లాన్ చేసే ఆలోచన చేస్తున్నాడ‌ట మ‌హేష్ బాబు.

ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు నెలకొన‌డం మనం చూసాం. మహేష్ బాబు అన్న రమేష్ బాబు, మహేష్ తల్లి ఇందిరా దేవి, అలాగే ఆయన నాన్న సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల గ్యాప్‌తోనే క‌న్ను మూసారు. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో వ‌రుస మ‌ర‌ణాలు మహేష్ బాబుని మానసిక వేదనకి గురి చేశాయి. ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతున్న మ‌హేష్ బాబు షూటింగ్ ప‌నుల‌లో బిజీ అయ్యాడు. అలానే త‌న కూతురికి సంబంధించిన శుభ‌కార్యం కూడా చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. మ‌హేష్ త‌ల్లి ఇందిరా దేవి చివరి కోరికగా సితారకు ఓణీల ఫంక్షన్ జరపనున్నారని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ వేడుక‌కి టాలీవుడ్‌కి సంబంధించిన ప్ర‌ముఖులందరిని ఇన్వైట్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

Exit mobile version