Site icon vidhaatha

ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన స్మృతి మంధాన …ఇంత‌కీ బాయ్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

స్మృతి మంధాన… భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌. దూకుడైన ఆట‌కు ప్ర‌సిద్ధి. అంత‌కుమించి గొప్ప అంద‌గ‌త్తె. హీరోయిన్ల‌కేమాత్రం తీసిపోని అందం. మామూలుగానే త‌న క్రేజ్ క్రికెట్ కంటే ఎక్కువ‌. ఇప్పుడు త‌ను నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఆర్‌సీబీ మ‌హిళ‌ల జ‌ట్టు డ‌బ్ల్యూపిఎల్ జ‌ట్టు రెండో ప్ర‌య‌త్నంలోనే టైటిల్ గెల‌వ‌డంతో స్మృతి ఓవ‌ర్‌నైట్ హీరో అయిపోయింది. త‌న గ్లామ‌ర్‌కు ఎంతోమంది ఫిదా. ఇంత‌కీ ఇంత‌మంది అభిమానుల మ‌న‌సు దోచిన స్మృతి ప‌డిపోయింది ఎవ‌రికో తెలుసా?

 

ప‌లాశ్ ముచ్చ‌ల్‌.. చూడ‌టానికి ఈ అబ్బాయి కూడా అందంగా ఉంటాడు. బాలీవుడ్‌లో సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు, గీత ర‌చ‌యిత‌ కూడా. అంతేకాదు, న‌టుడు కూడానండోయ్‌.. త‌న అక్కయ్య, ఫేమ‌స్ బాలీవుడ్ సింగ‌ర్‌ పాల‌క్ ముచ్చ‌ల్‌తో క‌లిసి దేశ‌మంతా స్టేజీ షోలు చేస్తుంటాడు. అది కూడా గుండెజ‌బ్బుల‌తో బాధ‌ప‌డే పేద చిన్నారుల‌కోసం. 2014లో బాలీవుడ్‌లోకి ప్ర‌వేశించిన ప‌లాశ్‌, దిష్కియావూం, భూత్‌నాథ్ రిట‌ర్న్స్ లాంటి సినిమాల‌కు సంగీతాన్ని అందించాడు. ఖేలే హ‌మ్ జీ జాన్ సే అనే చిత్రంలో కూడా న‌టించాడు. ఇవే కాకుండా ప్రైవేట్ ఆల్బ‌మ్స్ కూడా చేస్తుంటాడు.

 

మొద‌టిసారిగా 2023లో వీరి రిలేష‌న్ బ‌య‌ట‌ప‌డింది. ఆసియా గేమ్స్‌లో భాగంగా శ్రీ‌లంక‌పై భారీ విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టుకు స్మృతి నేతృత్వం వ‌హించింది. ఆ విజ‌యంతో దేశ‌మంతా త‌న‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. అందులో ఒక ప్ర‌త్యేక అభినంద‌న త‌న ఇన్‌స్టాలో పోస్ట్ అయింది. స్మృతి గోల్డ్ మెడ‌ల్ త‌న చేతుల్లో, ఇద్ద‌రూ అత్యంత స‌న్నిహితంగా.. అంతే.. దేశ‌వ్యాప్త స్మృతి ఫ్యాన్స్ గుండెలు బ‌ద్ద‌ల‌యిపోయాయి. ఎవ‌రీ పిల‌గాడు అని ఎంక్వైరీలు మొద‌లుపెడితే పై విశేషాల‌న్నీ తెలిసాయి. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ చెట్టాపట్టాలేసుకుని లండ‌న్ వీధుల్లో తిరిగిన ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.

ఇక మొన్న‌టి డ‌బ్ల్యూపిఎల్ ఫైన‌ల్లో మ్యాచ్ గెలిచిన త‌ర్వాత ప‌లాశ్‌తో క‌ప్పు ఎత్తుకుని ఉన్న ఫోటో మంధాన షేర్ చేసింది. దాంతో వీరి రిలేష‌న్ క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్టేన‌ని అబ్బాయిలు గోడుగోడున విల‌పిస్తున్నారు. ఇంత‌కీ త‌మ మ‌ధ్య ఉన్న బంధం గురించి వీరిద్ద‌రూ ఎప్పుడూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు సుమా..

Exit mobile version