Site icon vidhaatha

భార్య కౌగిలిలో బంధీ అయిన పుష్ప‌రాజ్.. రొమాంటిక్ కిస్‌తో ర‌చ్చ‌..!

పుష్ప‌..పుష్ప‌రాజ్.. ఈ పేరు చెబితే వెంట‌నే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్.. పుష్ప చిత్రంలో పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్ట‌డం మ‌నం చూశాం. బ‌న్నీ మానియా అంత‌ర్జాతీయ స్థాయికి కూడా పాకింది. ఈ క్ర‌మంలోనే మ‌నోడికి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కింది. పుష్ప చిత్రంలో బ‌న్నీ త‌న స్టెప్పులు, మ్యాన‌రిజంతో ఎంత‌గానో అల‌రించాడు. త‌న హావ‌భావాల‌తో ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాక్ చేశాడు. పుష్ప‌రాజ్ న‌ట‌నకి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం ఈ అల్లువార‌బ్బాయి పుష్ప‌2 సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా పుష్ప‌ని మించి ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నాడు. తొలి పార్ట్‌లో పుష్ప‌రాజ్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండ‌వ భాగంలో పుష్పరాజ్, షికావత్ మధ్య పోరాటం తారాస్థాయిలో ఉండబోతుంది అనేది చూపించ‌నున్నారు. అయితే బ‌న్నీ గ‌త కొద్ది రోజులుగా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న ఫ్యామిలీకి మాత్రం కొంత స‌మ‌యం కేటాయిస్తున్నాడు. ఇటీవ‌ల త‌న ఫ్యామిలీతో క‌లిసి ఇటలీ వెళ్లి అక్క‌డ వ‌రుణ్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో సంద‌డి చేశారు . అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్ద‌రు కూడా ట్రెండీ దుస్తుల‌లో కనిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

భార్య కౌగిలిలో బంధీ అయిన పుష్ప‌రాజ్.. రొమాంటిక్ కిస్‌తో ర‌చ్చ‌..!ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్నేహా రెడ్డి తాజాగా కేక పెట్టించే పిక్ షేర్ చేసింది. తన భర్తని కౌగిలిలో బంధించి రొమాంటిక్ గా ముద్దు ఇస్తున్న పిక్ ని షేర్ చేయ‌డంతో ఈ పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా కూడా వీరిద్ద‌రు ఇంకా చాలా రొమాంటిక్ అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్న‌రు. భార్య కౌగిలిలో పుష్పరాజ్ భ‌లే అరెస్ట్ అయ్యాడు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బ‌న్నీ, స్నేహాలు మాత్రం త‌మ రొమాంటిక్ పిక్‌తో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. బన్నీ, స్నేహల‌కి 2011లో వివాహం కాగా, ఈ జంట‌కి అల్లు అయాన్, అల్లు అర్హ ఇనే ఇద్ద‌రు పిల్లల సంతానం ఉన్న విష‌యం తెలిసిందే.

Exit mobile version