Site icon vidhaatha

వైట్ డ్రెస్‌లో యువ‌రాణిలా క‌నిపిస్తున్న వెంక‌టేష్‌ హీరోయిన్.. బికినీలో మాములు ర‌చ్చ చేయ‌ట్లేదుగా..!

బాబు బంగారం, ఆటాడుకుందాం రా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ సోన‌మ్ బ‌జ్వా. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో రాణించిన ఈ అందాల భామ ప్రస్తుతం పంజాబీ సినిమాలు మాత్ర‌మే చేస్తుంది.ఈ అమ్మ‌డు ముందుగా పంజాబీ సినిమాల‌తో కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత కప్పాల్ అనే సినిమాతో తమిళంలో నటించి అల‌రించింది. బాబు బంగారం సినిమాలో దండమే పెట్టుకొంటాం అనే స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత ఆటాడుకుందాం రా అనే సినిమాలో న‌టించ‌న ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో కూడా కొన్ని సినిమాల‌లో న‌టించి అల‌రించింది. సోన‌మ్ హిందీలో కూడా ప‌లు సినిమాలు చేసింది. ఆమెకు వ‌రుస అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి.

అయితే హిందీ సినిమాల్లో లిప్ లాక్ స‌న్నివేశాలు ఎక్కువ ఉంటాయి కాబ‌ట్టి బాలీవుడ్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. చాలా అవ‌కాశాల‌ని వ‌ద్ద‌నుకుంది. అయితే ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్రం ఘాటు అందాల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. తాజాగా బికినీ వేసి కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. వైట్ డ్రెస్‌లో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత అద‌ర‌హో అని చెప్పాలి. సోన‌మ్ బ‌జ్వా క్యూట్ లుక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు పిచ్చెక్కిపోతున్నారు. మైండ్ బ్లోయింగ్ లుక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సోనమ్‌ బజ్వా 2013లో వచ్చిన బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అనే పంజాబీ సినిమా ద్వారా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది.బికినీలో ఘాటు అందాలు చూపిస్తున్నా కూడా లిప్ లాక్ సీన్లు ఉంటే అవి రిజెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం పంజాబీ సినిమాలకు.. అది కూడా పద్దతిగా ఉన్న సినిమాలకు మాత్రమే సోన‌మ్ బ‌జ్వా క‌మిట్ అవుతంది. పంజాబ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న సోన‌మ్ ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో ర‌చ్చ చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. పంజాబీ భాషలో సోనమ్ బజ్వాకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకొంటున్న హీరోయిన్‌గా కూడా ఈ అమ్మ‌డికి మంచి రికార్డ్ ఉంది.

Exit mobile version