Site icon vidhaatha

బంగ్లాదేశ్‌ని ఊచ‌కోత కోసిన సౌతాఫ్రికా.. భారీ తేడాతో గెలుపు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్ మాములుగా లేదు. ఏ దేశ‌పు బౌల‌ర్‌ని అయిన ఊచ‌కోత కోసేస్తున్నారు. ఈ క్ర‌మంలో భారీ స్కోర్ సాధిస్తున్నారు. తాజ‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వీర‌విహారం సృష్టించారు స‌ఫారి బ్యాట్స్‌మెన్స్. ఓపెనర్ క్వింటన్ డికాక్(140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174) సెంచరీతో పరుగుల సునామీ సృష్టించగా.. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 ) మరోసారి అద్భుత‌మైన బ్యాటింగ్‌తో అల‌రించాడు.ఎయిడెన్ మార్క్‌రమ్(69 బంతుల్లో 7 ఫోర్లతో 60), డేవిడ్ మిల్లర్(15 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లతో రాణించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్ రెండు వికెట్లు తీయగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్, షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీసారు.

నెదర్లాండ్స్ చేతిలో ఓడిన ఒక్క మ్యాచ్ తప్పా సౌతాఫ్రికా.. ప్రతీ మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగుల స్కోర్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం. శ్రీలంకతో తొలి మ్యాచ్‌లో 428 పరుగులు .. ఆస్ట్రేలియాతో 311, ఇంగ్లండ్‌తో 399, బంగ్లాదేశ్‌తో 382 పరుగులు చేయ‌గా, ఈ అంకెలు చూస్తుంటే సౌతాఫ్రికా జ‌ట్టు ఎంత భీక‌ర ఫామ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతుంది.అయితే నెదర్లాండ్స్‌తో మాత్రమే చేజింగ్‌లో 207 రన్స్ చేసి ఓటమిపాలైంది. ఇక సౌతాఫ్రికా నిర్ధేశించిన భారీ ల‌క్ష్యాన్ని చేధించే క్ర‌మంలో బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. మహ్మదుల్లా(111) ఒక్కడే సెంచరీతో రాణించ‌గా, మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంద‌రు ఒక‌రి త‌ర్వాత ఒకరు క్యూ క‌ట్టారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(2/39), లిజాడ్ విలియమ్స్(2/56), కగిసో రబడా(2/42) రెండేసి వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ(3/63) మూడు వికెట్లు తీసాడు.

బంగ్లాదేశ్ ఒకానొక స‌మ‌యంలో కేవ‌లం 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మహ్మదుల్లా ఒంటరి పోరాటం చేయ‌డంతో గౌరవప్రదమైన స్కోర్ ద‌క్కింది. తన్జీద్ హసన్ 12, లిటన్ దాస్ 22 పరుగులు చేయగా షకీబ్ అల్ హసన్ 1, ముస్తాఫిజుర్ రహీం 8 పరుగులు చేశారు. నజ్ముల్ హుస్సేన్ షాంటో డకౌట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ 11, నసుమ్ అహ్మద్ 19, హసన్ మహ్మద్ 15 ఇలా ఎవ‌రు పెద్ద స్కోర్ చేయ‌లేక‌పోయారు.

Exit mobile version