Site icon vidhaatha

Trains Canceled | విజయవాడ వాసులకు గమనిక..! రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!

Trains Canceled | విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు డివిజన్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతపై రైల్వేశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాక్‌ల నిర్వహణ పనులు చేపడుతూ అవసరమైన చోట్ల మరమ్మతు పనులు చేపడుతున్నది. పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం-విశాఖపట్నం (17219), గుంటూరు-విశాఖపట్నం (22701-22702), ఏప్రిల్‌ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్‌ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్‌ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.

ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం-పాట్నా (22643), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్‌ – కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు-గౌహతి (12509), ఏప్రిల్‌ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో సీఎస్‌టీఎం (11019), ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు ధనాబాద్‌ – అలప్పుజ (13351), ఏప్రిల్‌ 4, 11, 18, 25 తేదీల్లో టాటానగర్‌-యశ్వంత్‌పూర్‌ (18111) దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్‌ – తాంబరం (12376), ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీల్లో టాటానగర్‌- బెంగళూరు (12889) రైళ్లను విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన‌ట్లు పేర్కొన్నారు.

Exit mobile version