Site icon vidhaatha

జ‌బ‌ర్ధ‌స్త్ నుండి సౌమ్య రావు బ‌య‌ట‌కు రావ‌డం వెన‌క కార‌ణం ఇదా..ఎట్ట‌కేల‌కి బ‌య‌ట‌పెట్టిందిగా..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచుతున్న కామెడీ షో జ‌బర్ధ‌స్త్. ఈ కార్యక్ర‌మం గత పదేళ్లుగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. అయితే ఒకప్పుడు ఈ కామెడీ షోకి ఎంత‌గానో క‌నెక్ట్ అయిన ఆడియ‌న్స్ ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా దృష్టి మ‌ర‌లుస్తున్నారు. అందుకు కార‌డం షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడ‌ర్స్, యాంక‌ర్స్, జ‌డ్జెస్ మార‌డం ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవచ్చు. నాగ‌బాబు అండ్ టీం త‌ప్పుకున్న త‌ర్వాత‌నే జ‌బ‌ర్ధ‌స్త్‌కి కాస్త క‌ళ త‌ప్పింది. ఇక ఆ త‌ర్వాత అనసూయ, రోజాలు కూడా షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో రేటింగ్ త‌గ్గుతూ వ‌స్తుంది. అయితే అన‌సూయ త‌ప్పుకున్న త‌ర్వాత క‌న్న‌డ బ్యూటీ సౌమ్య రావు జ‌బ‌ర్ధ‌స్త్‌కి హోస్టింగ్ చేస్తూ షోకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కేలా చేసింది.

కన్నడనాట బుల్లితెరపై సందడి చేసిన సౌమ్య‌రావు… కంటెస్టెంట్స్ నుంచి వచ్చే పంచ్ లను ఆస్వాదిస్తూ.. అంద‌రితో క‌లిసిపోతూ షోపై ఆస‌క్తిని పెంచింది. అయితే ఏం జ‌రిగిదో ఏమో కాని ఈ భామ స‌డెన్‌గా త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలో సిరి వ‌చ్చి చేరింది. అయితే జబర్థస్త్ నుంచి యాంకర్ సౌమ్య రావు సడెన్ గా మాయం కావ‌డంతో అంద‌రిలో అనేక అనుమానాలు త‌లెత్తాయి. తను వెల్లిపోయిందా..? లేక తీసేశారా..? అనే సందేహం అంద‌రిలో ఉంది. తాజాగా సౌమ్యరావు ఈ విషయంలో చెప్పినసమాధానం అందరికి అనేక అనుమానాలు క‌లిగించింది.

జబర్థస్త్ సన్నిహితులు సమాచారం ప్రకారం సౌమ్యను యాంకర్‌గా తీసేశారనే ప్ర‌చారం న‌డిచింది. ఈ క్ర‌మంలో ఓ నెటిజన్ ఆమెను డైరెక్ట్‌గా అడిగేశారు. మీరు ఎందుకు జబర్దస్త్ షోను వదిలి వెళ్లారు? అని నెటిజన్ అడిగితే.. దానికి సౌమ్య ఇచ్చిన రిప్లై ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. టైం వస్తుంది.. అప్పుడు అన్నీ చెప్తా.. థాంక్యూ సో మచ్ అంటూ చాట్ ముగించింది. అంటే జబర్దస్త్ షోకు సౌమ్య దూరం అవ్వడం వెనక పెద్ద తతంగమే న‌డిచిందా, మ‌ల్లెమాల సంస్థ కావాల‌నే సౌమ్య‌ని తీసేసిందా అనే అనుమానాలు నెల‌కొన్నాయి. దీనిపై సౌమ్య త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నుంది.

Exit mobile version