అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా చిత్రంతో తొలి హిట్ కొట్టింది. ధమాకా తర్వాత టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరు మార్మొగింది. ఈ అమ్మడు తనకు వచ్చిన ఆఫర్స్ అన్ని ఓకే చేసింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ఈ మధ్య కాలంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అవుతున్నాయి. రామ్ పోతినేని ‘స్కంధ’ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, నితిన్ ‘ఎక్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఇలా అన్ని చిత్రాలన్నింటిలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా చేయగా, ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో సిస్టర్ పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మకి ఒక్క హిట్ దక్కింది కాని అది బాలయ్య ఖాతాలోకే పూర్తిగా చేరింది. ఇక లేటెస్ట్‌గా వచ్చిన గుంటూరు కారంపై శ్రీలీల బోలేడన్ని ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్‌ని తెచ్చుకోవడంతో శ్రీలీల పని అయిపోందని చాలా మంది చెప్పుకొచ్చారు. పూజా హెగ్డే, కృతీశెట్టి లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి తప్పులే చేసి.. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకుండా ఉన్నారు. శ్రీలీల పరిస్థితి కూడా అలా మారుతుందని చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా శ్రీలీలకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
శ్రీలీల ఇటు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క ఎంబిబిఎస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కొన్ని ఎగ్జామ్స్ కి కూడా అటెండ్ అయింది. ముంబైలో ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యినప్పుడు వైవాని కూడా ఫేస్ చేశారు. అయితే గుంటూరు కారంలో మహేష్ సరసన శ్రీలీల నటిస్తుందని తెలిసి వైవాలో ఆమెకు కొన్ని ఎక్స్‌ట్రా మార్కులు వేశారట. ఈ విషయాన్ని శ్రీలీల స్వయంగా తెలియజేశారు. అలాగే గుంటూరు కారం మూవీకి ముంబై థియేటర్స్ లో వస్తున్న క్రేజ్ కూడా చూసి ఆశ్చర్యపోయినట్లు శ్రీలీల పేర్కొన్నారు. అక్కడి థియేటర్స్ లో మహేష్ బాబు ఎంట్రీకి పేపర్స్ ఎగరేయడం, సందడి చేయడం చాలా సంతోషంగా అనిపించిందని శ్రీలీల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలీల కామెంట్స్ వైరల్‌గా మారాయి.