అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని పుష్కలంగా ఉన్న నటి ఎవరు అని అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌ని దున్నేస్తుంది అగ్రదర్శకనిర్మాతల ఫోకస్ అంతా తనవైపునకు తిప్పేసుకుంది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల రచ్చ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ ఫొటో పెట్టిందంటే చాలు నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే అన్నట్టుగా పరిస్తితి మారింది. తాజాగా శ్రీలీల ఎల్లో కలర్ టైట్ డ్రెస్‌లో హొయలుపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది . మంత్రముగ్దులను చేసే అందంతో నెట్టింట హల్ చల్ చేస్తున్న శ్రీలీలని చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
శ్రీలీల ఇలా చలికాలంలో మరింత వణుకు పుట్టించకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ధమాకా సినిమాలో తన డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన శ్రీలీల.. ఈ ఏడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబోలో వచ్చిన స్కంద, అలానే బాలకృష్ణ టైటిల్ పోషించిన భగవంత్ కేసరితో సందడి చేసింది. ఇక మరి కొద్ది రోజులలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఆదికేశవ చిత్రంతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. శ్రీలీల రాకముందు కాజల్, రష్మిక, సమంత, పూజా వంటి కథానాయిక జోరు సాగగా, ఇప్పుడు వాళ్లందరిని పక్కకి నెట్టేసి అందరిలోనూ ఫోకస్ పాయింట్‌గా నిలుస్తుంది శ్రీలీల.
శ్రీలీల తెలుగమ్మాయి కాగా, ఆమె బెంగుళూరు నుంచి వచ్చినా, మూలాలు మాత్రం తెలుగువే. అయితే అక్కడి నుంచి రావడం కారణంగానే ఈ అమ్మడిని తెగ ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ కావడంతో ఆమె కావాలని యంగ్ హీరోల నుంచి స్టార్స్ వరకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇప్పుడు మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్‌గా మారింది శ్రీలీల.శ్రీలీల ఒక్కో సినిమాకి మూడు కోట్లు తీసుకుంటుందట. అందులో రెండున్న కోట్లు తన పారితోషికం, మరో యాభై లక్షలు ఇతర ఖర్చుల లెక్కగా చెప్పుకొస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో `ఎక్స్ ట్రా` మూవీతో, సంక్రాంతికి `గుంటూరు కారం` చిత్రంతో శ్రీలీల పలకరించనుంది. అలాగే పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్ భగత్ సింగ్` చేస్తుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీలోనూ ఉంది. కానీ ఈ మూవీ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది.