బుల్లితెర యాంకర్‌గా స్మాల్ స్క్రీన్‌పై తెగ సందడి చేస్తుంది శ్రీముఖి. పటాస్ అనే షోతో పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి ఆ తర్వాత వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ యాంకర్‌గా మారింది. తన ఎనర్జీ లెవల్స్, చలాకి మాటలు, కామెడీ టైమింగ్ చూసి ఆశ్చర్యపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమాలలోను అడపాదడపా కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. మరోవైపు పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే శ్రీముఖి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.
అయితే ఈ అమ్మడు మాత్రం ఆ వార్తలని కొట్టి పారేస్తుంటుంది. అయితే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో లవ్ మ్యాటర్ బయటపెట్టి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. రీసెంట్‌గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా, ఇందులో సీరియల్ నటుడికి వేదిక మీద ప్రపోజ్ చేసింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ షో కోసం గుండెనిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్ లోని ఆర్టిస్టులు వచ్చారు. అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు ని చూసి శ్రీముఖి గుండెల్లో గంటలు మోగాయని పేర్కొంది.ఇక అతనితో డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ చేసింది. అతనిపై కొన్ని కవితలు కూడా చెప్పి తన ప్రేమలో అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది.
అయితే అతనికి తెలుగు రాకపోవడంతో శ్రీముఖి చెప్పిన మాటలు ఏమి అర్ధం కాలేదు. దీంతో అతని చేయి పట్టుకొని తెలుగు కూడా నేర్పించింది. బాలు చేతితో అక్షరాలు రాయిస్తూ ఐ లవ్ యు శ్రీముఖి అంటూ రాసింది.. మొత్తానికి శ్రీముఖి చేసిన రచ్చకి ప్రతి ఒక్కరు స్టన్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా దీనిపై నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీముఖి అడపాదడపా సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని ఫుల్ ఎంటర్‌టైన్ కూడా చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.