నటిగా కెరీర్ మొదలు పెట్టిన శ్రీముఖి ఇప్పుడు యాంకర్‌గా సత్తా చాటుతుంది. పటాస్ షో శ్రీముఖికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడి జోరుకి అడ్డే లేకుండా పోయింది. అనేక టీవీ ఛానెల్స్‌లో డిఫరెంట్ షోస్ చేస్తూ స్టార్ యాంకర్‌గా ఎదిగింది. ఈవెంట్స్, షోస్ చేస్తూ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇక అడపాదడపా సినిమాలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది.చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రంలో మెరిసింది. చిత్రంలో చిరు సరసన చిన్న సీన్ లో నటించిన కూడా తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఇక శ్రీముఖికి సినిమాలలో మంచి పాత్రలు వస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తున్నట్టు ఓ టాక్ వినిపిస్తుంది.
ఇక శ్రీముఖి లౌడ్ స్పీకర్ మాత్రమే కాదు, ఫైర్ బ్రాండ్‌కి కేరాఫ్ అడ్రెస్ కూడా. తాజాగా ఈ భామ యంగ్ హీరో చెంప చెల్లుమనిపించి వార్తలలోకి ఎక్కింది. అసలు ఆమెకి అంత కోపం వచ్చిందబ్బా అని అందరు ఆలోచనలో పడ్డారు. అసలు విషయంలోకి వెళితే హీరో పార్వతీశం,హర్షవర్ధన్, అవినాష్, మాహబూబ్ భాషా ప్రధాన పాత్రలో రూపొందిన ‘మార్కెట్ మహాలక్ష్మి’ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో శ్రీముఖి కార్యక్రమానికి హాజరయ్యాడు.ఆమె స్టేజీ పై ఉండగా పార్వతీశం స్టేజ్‌పైకి వెళ్లి మీరంటే నాకు ఇష్టం ఐలవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. దాంతో అతడి చెంప చెళ్లుమనిపిస్తుంది రాములమ్మ.
అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో యంగ్ హీరో శ్రీముఖి చేయిని పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా సినిమా ప్రమోషన్ లో భాగంగానే చేశారని, మొత్తానికి ఇలా సినిమాకు మంచి ప్రమోషన్ దక్కినట్టైంది అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుండడం మనం చాలానే చూస్తున్నాం. ఇక ఈ చిత్రంలో పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించారు. విఎస్ ముఖేష్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు నిర్మించగా, ఈ చిత్రం బీ2పీ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కబోతోంది.మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి.