Site icon vidhaatha

జాన్వీని శ్రీదేవి ఆ తెలుగు బూతుతో తిట్టేదా.. ఇంత‌కీ ఆ బూతు ఏంటో తెలుసా?

అతిలోక సుంద‌రి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిందంటే ఎవ‌రికి న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదు. త‌న అందం, న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న శ్రీదేవి ఊహించ‌ని విధంగా క‌న్నుమూసింది. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికీ కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.అయితే శ్రీదేవి తాను ఉన్న‌న్ని రోజులు కూడా కూతుళ్లని హీరోయిన్‌గా నెల‌బెట్టాల‌ని ఎంతో త‌హ‌త‌హ‌లాడింది. కాని కోరిక తీర‌కుండానే కాలం చేసింది. అయితే శ్రీదేవి చ‌నిపోయాక కొన్ని నెల‌ల‌కి జాన్వీ క‌పూర్ ద‌ఢ‌ఖ్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.

జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా త‌న గ్లామ‌ర్‌తోనే తెగ అట్రాక్ట్ చేస్తుంటుంది.ఇక మూవీ ప్ర‌మోషన్స్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. శ్రీదేవికి, జాన్వీకి మ‌ధ్య ఎన్నో జ్ఞ‌పకాలు ఉండ‌గా, అప్పుడ‌ప్పుడు వాటిని రివీల్ చేస్తుంటుంది. తాజాగా జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లి త‌న‌ని తెలుగులో తిట్టేద‌ని చెప్పుకొచ్చింది. ‘నేను ప్రతీసారి అమ్మ రూమ్‌కు వెళ్లి లిప్‌స్టిక్‌ను దొంగతనం చేసి పాకెట్స్ నిండా పెట్టుకొని వచ్చేదాన్ని. అప్పుడు పాకెట్లు చూపించు అనేది. నేను వద్దమ్మా అనేదాన్ని. అప్పుడు ‘నా కొడకా’ అనే తిట్టేది’’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. బూతు ప‌దాన్ని జాన్వీ క‌పూర్ చాలా క్యూట్‌గా చెప్ప‌డంతో ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇక జాన్వీ క‌పూర్ సౌత్ ఎంట్రీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, తెలుగులో ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న‘దేవర’తో ప‌ల‌క‌రించ‌బోతుంది. అప్పట్లో తన తల్లి శ్రీదేవి.. సీనియర్ ఎన్‌టీఆర్‌తో నటిస్తే.. ఇప్పుడు జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్‌టీఆర్‌తో నటిస్తుండ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఇక జాన్వీ దేవర’తో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది .‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ‘ఉలఝ్’ చిత్రాలు కూడా చేస్తుంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఓటీటీ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ‘ది ఆర్చీస్’ అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది ఖుషీ. ఇందులో ఖుషీ న‌ట‌న‌కు మిక్స్డ్ టాక్ వ‌చ్చింది.

Exit mobile version