ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలతో అలరిస్తున్నారు శ్రీకాంత్. మొదట్లో వన్ బై టు అనే సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.అయితే ఈ సినిమా కంటే ముందే చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ తో పాటు విలన్ పాత్రల్లో నటించారు. తాజ్ మహల్ అనే చిత్రంతో శ్రీకాంత్ హీరోగా నిలదొక్కుకున్నాడని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ఏర్పడింది.దాంతో వరుసగా స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఇక సినిమా పరిశ్రమలో స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో ఊహాతో ప్రేమలో పడ్డాడు. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కన్నడ పరిశ్రమలో ఊహ కెరీర్ మొదలు కాగా, ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించారు. 1994లో విడుదలైన ‘ఆమె’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఊహ. దర్శకుడు ఇవివి సత్యనారాయణ ట్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీకాంత్, నరేష్ హీరోలుగా చేశారు. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమలో పడడం 1997లో శ్రీకాంత్-ఊహ వివాహం చేసుకోవడం జరిగింది. వీరి పెళ్ళికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్లుగా శ్రీకాంత్-ఊహ కలిసి కాపురం చేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే.. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందD చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు.
హీరో శ్రీకాంత్ కూతురి ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే..!
ఇక అమ్మాయి మేధ త్వరలో హీరోయిన్‌గా అలరించనుందని అంటున్నారు. ఈ అమ్మడు అందంలో అమ్మా నాన్నలకు మించి ఉంటుంది. చక్కని రూపం, తేనే కళ్ళతో చూడగానే కట్టిపడేసే గ్లామర్ మేధ సొంతం. బయట ఎక్కువగా కనపడని మేధ రీసెంట్‌గా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. ఆలయ ప్రాంగణంలో తల్లి ఊహతో కలిసి కనిపించడంతో ఫొటోగ్రాఫర్స్ ఆమెని కెమెరాలలో బంధించే ప్రయత్నం చేశారు. చీరలో మేధ సాంప్రదాయబద్దంగా దర్శనమిచ్చారు. ఆమె కట్టు బొట్టు చూస్తే అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది.మేధ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మేధ చదువు ఇటీవలే పూర్తి చేసినట్లు తెలుస్తుండగా, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.