Site icon vidhaatha

పెళ్లిపై సుధీర్ అంత మాట అనేశాడేంటి.. ర‌ష్మీతో పెళ్లి అన‌గానే..!

జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో ఎంతో మంది వెలుగులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో సుధీర్ ఉన్న‌ప్పుడు ర‌ష్మీతో ఆయ‌న చేసిన సంద‌డి మాములుగా ఉండేది కాదు. సుధీర్‌, రష్మిల మధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డంతో ప‌లు సంద‌ర్భాల‌లో వారిద్ద‌రికి పెళ్లి కూడా చేశారు. ఈ ఇద్ద‌రి స్క్రీన్‌పై అలా చూసిన వారంద‌రు ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది క‌దా అని అనుకుంటున్నారు. ఎప్ప‌టి నుండో ఈ ఇద్ద‌రి పెళ్లి గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే అటు సుధీర్ కాని ఇటు ర‌ష్మీ కాని త‌మ పెళ్లిపై పాజిటివ్‌గా స‌మాధానం ఏ నాడు ఇవ్వ‌లేదు. తాము ఇద్ద‌రం ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెప్పుకు వ‌చ్చారు.

అయితే తాజాగా ర‌ష్మీతో పెళ్లి గురించి సుడిగాలి సుధీర్ కి ప్న‌శ్న ఎదురు కాగా, ఆయ‌న ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌గా మారింది. గాలోడు సినిమా హిట్ సుధీర్ సినిమాల వేగం పెంచాడు. మంచి క‌థ‌ల‌ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న నటించిన తాజా చిత్రం `కాలింగ్‌ సహస్త్ర` . ఈ మూవీ ట్రైలర్‌ ఈవెంట్ రీసెంట్‌గా జరిగింది. ఇందులో రష్మితో పెళ్లి ఎప్పుడు ? అనే ప్రశ్న సుధీర్‌కి ఎదురు కాగా, ఆయ‌న స్పందిస్తూ.. ఈ ప్ర‌శ్న తనకు తరచూ ఎదురవుతూనే ఉందని తెలిపారు. అంతగా జనం మమ్మల్ని ఓన్‌ చేసుకున్నారని, అందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. రష్మితో కెమిస్ట్రీ, వగైరా అంతా స్క్రీన్‌ కోసం చేసిందే అని అన్నారు.

ఇక పెళ్లి గురించి మాట్లాడిన సుధీర్ ప్రస్తుతానికి సినిమాలపైనే తన ఫోకస్‌ ఉందని, పెళ్లి గురించి ఇప్పుడు అయితే ఆలోచించడం లేదన్నారు. పెళ్లి అనేదే తన మైండ్‌ లో లేదని, నాకసలు మ్యారేజే వద్దు అని షాకింగ్ కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాను. కెరీర్‌,ఫ్యామిలీ అనే వేలో వెళ్తున్నా, ఒకవేళ దేవుడు అటు కాదు, ఇటూ కూడా అని పెళ్లి వైపు తిప్పితే చెప్పిలేను గానీ, ప్రస్తుతం తాను కంఫర్ట్ జోన్‌లో ఉన్నాన‌ని సుధీర్ స్ప‌ష్టం చేశాడు. ఇ్ రష్మితో కలిసి సినిమా చేయడంపై సుధీర్‌ స్పందిస్తూ, ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నామని, కానీ అలాంటి కథలు దొరకడం లేదని చెప్పుకొచ్చారు. నచ్చే స్క్రిప్ట్, ఇద్దరికి సెట్‌ అయ్యే స్క్రిప్ట్ వస్తే చేసేందుకు తామిద్దరం సిద్ధంగానే ఉన్న‌ట్టు సుధీర్ పేర్కొన్నారు.

Exit mobile version