Site icon vidhaatha

Aishwaryaa Rajinikanth | రజనీకాంత్‌ కూతురు ఐశ్యర్య ఇంట్లో చోరీ.. బంగారు ఆభరణాలు మాయం..!

Aishwaryaa Rajinikanth | ప్రముఖ నటుడు రజనీకాంత్‌ కూతురు ఐశ్యర్య రాజనీకాంత్‌ ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని ఐశ్వర్య నివాసంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు దొంగతనానికి పాల్పడ్డారు. లాకర్‌లో దాచిన 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు మాయమయ్యాయని ఐశ్యర్య రాజనీకాంత్‌ తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సౌందర్య ఫిర్యాదు మేరకు తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చోరీ అయిన నగలను చివరిసారిగా 2019లో తన సోదరి సౌందర్య పెళ్లిలో ధరించానని, ఆ తర్వాత వాటిని లాకర్‌లో దాచిపెట్టినట్లు చెప్పింది.

గతంలో లాకర్‌ను 2021లో మూడుచోట్లకు మార్చారని, ఆగస్టు 21, 2021న ఆమె మాజీ భర్త ధనుష్‌కి చెందిన సీఐటీ నగర్‌లోని ఫ్లాట్‌లో ఇతర గృహోపకరణాలతో పాటు లాకర్‌ను తీసుకెళ్లారని, సెప్టెంబర్ 2021లో చెన్నైలోని సెయింట్ మేరీస్ రోడ్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌కి మార్చామని, చివరిసారిగా ఏప్రిల్ 2022లో లాకర్ పోయెస్ గార్డెన్‌లోని నివాసానికి మార్చినట్లు పేర్కొంది. లాకర్‌ తాళాలు సెయింట్‌ మేరీస్‌ రోడ్‌లోని ఫ్లాట్‌లో ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ నెల 10న లాకర్‌ను తెరిచి చూడగా.. ఆభరణాలు కనిపించకపోవడంతో ఐశ్యర్య షాక్‌కు గురైంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పని మనిషి ఈశ్వరి, లక్ష్మితో పాటు డ్రైవర్‌ వెంకట్‌లపై అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. వీళ్లు తరుచూ అపార్ట్‌మెంట్‌కు వెళ్లేవారని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఐశ్యర్య ‘లాల్‌ సలామ్‌’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది. ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ కీలక పాత్రలో పోషిస్తుండగా.. రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version