Site icon vidhaatha

ఏంటి.. అయోధ్య రాముడి ముఖం విజ‌య్ కాంత్ పోలిక‌ల‌తో ఉందా.. ఇప్పుడిదే చ‌ర్చ‌

దాదాపు 500 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మించాల‌ని ఎంతో మంది ప్ర‌యత్నించారు. కాని అది కుద‌ర‌లేదు. కాని మోదీ సంక‌ల్పంతో ఎట్ట‌కేల‌కి అంద‌రి క‌ల తీరింది. అయోధ్య‌లో బాల రాముడు కొలువుదీరాడు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ అనంతరం లక్షలాది మంది యాత్రికులు అయోధ్యకు తరలివస్తుండటంతో అధికారులు అక్క‌డ‌ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయం వెలుపల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వు ఫోర్స్‌ బలగాలను మోహరించారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు దర్శన వేళలను పొడిగించారు. గురువారం ఉదయం 6గంటల నుంచే బాల రాముడి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ పూజలు, దర్శనాలకు అనుమతించాలని ట్రస్టు నిర్ణయించింది.

ఇక 51 అంగుళాల బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన స‌మ‌యంలో అంద‌రు చాలా సంతోషించారు. చిరనవ్వుతో.. ప్రస్నవదనం కలిగిన రామ్ లల్లా విగ్రహం నల్లరాతితో ముగ్ద మనోహరంగా ఉండ‌గా, అది ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సోష‌ల్ మీడియాలో రామ్ ల‌ల్లా పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ సుంద‌ర రాతి విగ్ర‌హంకి సంబంధించిన ముఖార‌విందంపై ఇప్పుడు త‌మిళ‌నాట జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. రామ్ ల‌ల్లా ముఖార‌విందం కెప్టెన్ విజ‌య్ కాంత్ మాదిరిగా ఉంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. విజ‌య్ కాంత్ క‌ళ్లు, రామ్ ల‌ల్లా క‌ళ్లు ఒకే మాదిరిగా ఉన్నాయ‌ని, ముఖ పోలిక‌లు కూడా అలానే ఉన్నాయంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

మ‌రికొంద‌రు విగ్రహం కళ్ళు.. నవ్వు రెండూ తమ స్టార్ హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నాయని చెబుతూ ఈ విష‌యాన్ని తెగ వైర‌ల్ చేస్తున్నారు. త‌మిళ‌నాట త‌మ హీరోల‌ని దేవుళ్ల‌తో పోల్చ‌డం సాధార‌ణంగా జ‌రుగుతున్న విష‌యమే. ఇప్పుడు అలానే విజ‌య్ కాంత్‌తో రామ్ ల‌ల్లాతో పోల్చార‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. కరోనా సోకడంతో ఆయన్ను చెన్నైలో మియోట్ ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసకోశ సమస్యల కారణంగా విజయకాంత్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే పరిస్థితి విషమిండంతో కన్నుమూశారాని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇక విజ‌య్ కాంత్ సినిమాల్లో నటిస్తూనే, నిర్మాత, దర్శకునిగా తన సేవల్నీ అందించాడు

Exit mobile version