ఎంఎస్ నారాయణ రాసిన కథల్ని కాజేసిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే.. ?

  • Publish Date - October 23, 2023 / 02:29 PM IST

సినిమా.. ప్రేమ, ఫ్యామిలీ, విలనిజం, హీరోయిజం, హీరోయిన్ అందాలు ఇలా ఎన్నో ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఉండాలి. కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన కమెడియన్స్ లో ఎంఎస్ నారాయణ కూడా ఒకరు. తన దైన స్టైల్ లో సరికొత్త కామెడీని అందించారు. ఆయన హవా మాములుగా ఉండేది కాదు. అలాంటి వ్యక్తి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన మరణించడం యావత్ సినీ ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఆయన లేని లోటు ఎన్నో సినిమాల్లో కనిపించింది. ఇక బ్రహ్మానందం కూడా సినిమాలు చేయడం తగ్గించేశారు. అంతటి అద్భుతమైన కామెడీ ప్రస్తుతం ఉన్న సినిమాల్లో రావడం లేదు. ఇక ఎంఎస్ నారాయణ ఒక కమెడియన్ మాత్రమే కాదు.. గొప్ప రచయిత కూడా. ఆయన ఎన్నో అద్భుతమైన నవలలు రాశారు. ఆయన రాసిన కథలు డైలీ సీరియల్స్ లో పత్రికల్లో వచ్చేవి.

వాటికి ఆదరణ కూడా ఎంతో అద్భుతంగా ఉండేది. ఒక రచయితగా తనకు ఓ డైరెక్టర్ తో జరిగిన చేదు అనుభవాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కెరీర్ స్టార్టింగ్ లో ఓ డైరెక్టర్ తన దగ్గర కథలు కాజేసి తన పేరు కూడా వేయకుండా ఆ డైరెక్టర్ పేరు వేసుకున్నారు. తనకు ఫుల్ గా కోపం వచ్చి మందు తాగి అతనితో గొడవపడ్డానని అన్నారు. ఆ దర్శకుడు శివ నాగేశ్వరరావు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని డైరెక్ట్ చేశారు. అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ సిసింద్రీ సినిమాను తెరకెక్కించింది ఆయనే. ఇక రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన మనీ సినిమాకి కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. చాలాకాలం తర్వాత ఆయన ఈ ఏడాది దోచేవారెవరురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రజంట్ శివనాగేశ్వరరావు చేసిన సినిమాల్లో ఏ సినిమాకు ఎంఎస్ నారాయణ కథను కాజేసి ఉంటారని అభిమానులు వెతుకుతున్నారు. నిజానికి మందు చాలా మందికి హానీ చేస్తుంది. కానీ ఎంఎస్ నారాయణ విషయంలో మాత్రం మందు చాలా మేలు చేసిందట. చాలా సిట్యూవేషన్స్ లో ఆయనకు గొడవ పడే ధైర్యాన్ని ఇచ్చిందట. మాములుగా ఉన్నప్పుడు తనలో తాను బాధపడేవారట. కానీ మందు తాగినప్పుడు మాత్రం తనలోని వైల్డ్ యాంగిల్ బయటకు వచ్చేదట. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో ఎంఎస్ నారాయణ మందు తాగి నటించేవాడని కూడా అప్పట్లో సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.

Latest News