Site icon vidhaatha

సంక్రాంతి రేసు నుండి ఆ రెండు సినిమాలు ఔట్..ఇక ఈ ఏడాది పందెం కోళ్లు ఏంటంటే..!

సంక్రాంతి వ‌చ్చిందంటే థియేటర్స్‌లో ఎంత కోలాహ‌లం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచేందుకు రెడీ అవుతుంటాయి. గ‌త ఏడాది సంక్రాంతికి చిరంజీవి,బాల‌కృష్ణ, నాగార్జున‌ వంటి సీనియ‌ర్ హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వినోదం పంచారు. ఈ ఏడాది సంక్రాంతికి చూస్తే మొత్తం ఐదు సినిమాలు బ‌రిలోకి దిగ‌బోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా మ‌హేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ జనవరి 12 వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శ్రీలీలా, మీనాక్షి చౌదరి ఇందులో కథానాయిక‌లుగా న‌టించారు.

ఇక ఆ త‌ర్వాత వెంక‌టేష్ త‌ర్వాత న‌టించిన సైంధ‌వ్ చిత్రంపై భారీ హోప్స్ ఉన్నాయి. జ‌న‌వ‌రి 13న థియేట‌ర్స్‌లోకి రానున్న ఈ సినిమాని యాక్షన్ థ్రిల్లర్‌గా శైలేష్ కొల‌ను తెర‌కెక్కించాడు. ఇక వీటితో పాటు యంగ్ హీరో తేజా సజ్జా నటించిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’మూవీ జనవరి 12న మ‌హేష్ బాబు చిత్రానికి పోటీగా రాబోతోంది. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ కాగా, ఈ మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన ఫ్యామిలీ స్టార్‌ని సంక్రాంత‌కి రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కాని ఇది వాయిదా ప‌డింది. ర‌వితేజ‌ ‘ఈగల్’ చిత్రాన్ని కూడా సంక్రాంత‌కి ప్లాన్ చేసారు. కాని వాయిదా వేసిన‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటించారు.

ఇక 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫైన‌ల్ డేట్ ఇంక ప్ర‌క‌టించ‌లేదు. మ‌రోవైపు న‌టుడు, బిగ్ బాస్ 7 ఫేమ్ శివాజి ప్రధాన పాత్రలో నటించిన #90s ఏమిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కూడా సంక్రాంతికి వారం ముందుగానే రాబోతోంది. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇక కోలీవుడ్ టాప్ హీరోలు ధ‌నుష్ ,శివ కార్తికేయ‌న్ సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాలని అనుకున్నారు. కాని ఇప్ప‌టికే తెలుగు సినిమాల‌కే థియేట‌ర్స్ దొర‌క‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో ధ‌నుష్ న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్, శివ‌కార్తికేయ‌న్ న‌టించిన అయ‌లాన్ చిత్రాల‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి తెలుగులో మాత్రం సంక్రాంతి త‌ర్వాత రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Exit mobile version