Site icon vidhaatha

సినిమా అవ‌కాశ‌ల్లేవ్.. 35 ప్ల‌స్ ఏజ్ ఉన్న ఈ హీరోయిన్స్ వచ్చే ఏడాది పెళ్లి పీట‌లెక్కుతారా..!

సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక చాలా మంది భామ‌లు లేటుగా పెళ్లి పీట‌లు ఎక్కుతుంటారు.అయితే అవ‌కాశాలు వ‌స్తున్నంత సేపు పెళ్లి చేసుకోకున్నా ప‌ర్లేదు కాని, అవకాశాల లేకుండా ఖాళీగా ఉన్న వారిని మాత్రం నెటిజ‌న్స్ పెళ్లెప్పుడు అని ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తుంటారు.ఇండ‌స్ట్రీలో 35 ఏళ్ళు నిండినా కూడా కొందరు హీరోయిన్లు సింగిల్ గానే ఉంటున్నారు. వారు కనీసం 2024లో అయినా పెళ్లి పీటలు ఎక్కుతురామేన‌ని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఇంత‌కు ఆ హీరోయిన్స్ ఎవ‌రు అనేది చూస్తే.. కంచె బ్యూటీ ప్ర‌గ్యా జైస్వాల్. 36 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ భామ‌కి పెద్దగా అవ‌కాశాలు లేవు. చివరగా అఖండ చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం హిట్ అయిన ఆఫ‌ర్స్ లేవు. దీంతో వ‌చ్చే ఏడాది పెళ్లి ఊసు ఎత్తుతుందా అని అందరు ముచ్చ‌టించుకుంటున్నారు.

సొట్ట‌బుగ్గ‌ల సుందరి తాప్సి 36 ఏళ్ళు నిండినా ఇంకా చేసుకోలేదు. కాని ఓ వ్య‌క్తితో మాత్రం ప్రేమాయ‌ణం న‌డుపుతుంది. వ‌రుస ఆఫ‌ర్స్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో పెళ్లి కాస్త డిల్ చేస్తుంది. క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్.. వయసు 37 ఏళ్ళు. ఆమె శాంత‌ను అనే వ్య‌క్తితో డేటింగ్‌లో ఉంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో పెళ్లికి దూరంగా ఉంది. 2024లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెడతారేమో చూడాలి. ఇక చెన్నై చంద్రం త్రిష వయసు ఏకంగా 40 ప్లస్ . నాలుగు పదుల వయసు దాటినా ఈ అమ్మడికి అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. అందుకే పెళ్లిపై దృష్టి పెట్ట‌డం లేదు. నిత్యామీనన్ వయసు 35 వ‌ర‌కు ఉండొచ్చు. అమ్మ‌డికి పెద్ద‌గా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. ఇటీవ‌ల‌ వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది. 2024 లో నిత్య మీనన్ పెళ్లిపై నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

చిరుత బ్యూటీ నేహా శర్మ వయసు . ఈ అమ్మ‌డు సినిమాల‌లో పెద్ద‌గా న‌టించ‌డం లేదు కాని, సోషల్ మీడియాలో మాత్రం అందాలో ప్ర‌కంప‌న‌లు రేపుతుంది. 2024లో అయినా ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి పీటలెక్కుతుందా అంటే క‌ష్ట‌మే అంటున్నారు. ఇక మోస్ట్ సీనియ‌ర్ హీరోయిన్ అనుష్క వయసు 42 ఏళ్ళు. ఈవిడ పెళ్లి గురించి రూమర్స్ రావ‌డ‌మే త‌ప్ప జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగా ఉంటున్న ఈ భామ 2024లో పెళ్లి చేసుకుంటుందా అనేది చూడాలి. ఇక అంజలి వ‌య‌స్సు 37 కాగా, తమిళ హీరో జై తో కొంతకాలం రిలేషన్ న‌డిపింది. ఆ త‌ర్వాత అత‌నికి బ్రేక‌ప్ చెప్పి సినిమాలు చేస్తుంది. చూస్తుంటే ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. ఇక కేథరిన్ 35 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టింది. అవ‌కాశాలు పెద్ద‌గా లేవు. ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

Exit mobile version