Site icon vidhaatha

ఈ వారం ఓటీటీ, థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఏంటి.. దేనిపై ఎక్కువ ఫోక‌స్ ఉంది అంటే..!

ఇప్పుడు ఎగ్జామ్ సీజ‌న్ న‌డుస్తుంది. అందువ‌ల్ల థియేట‌ర్స్‌తో పెద్ద సినిమాల జాడ‌లేదు. మార్చి నుండి మే వ‌రకు ఏవో చిన్నా చిత‌కా సినిమాలు మాత్ర‌మే ప్రేక్ష‌కులకి ముందుకు వ‌చ్చి ఎంట‌ర్‌టైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తాయి. ఓటీటీలో మాత్రం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొద‌వే లేదు. ప‌లు వెబ్ సిరిసీలు, కొత్త సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ వారం ఏడు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ కానుండ‌గా, అంద‌రి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. తెలుగు వెర్షన్ కూడా ఈ వారం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూస్తే.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ మార్చి 22న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది.

ఇక అనన్యా అనే థ్రిల్లర్ మూవీ కూడా మార్చి 22న రిలీజ్ కాబోతోంది. ఆశీష్ గాంధీ లీడ్ రోల్ లో నటించిన హద్దులేదురా మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకి వ‌చ్చి సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. అయితేఈ వారం థియేట‌ర్స్‌లో పెద్ద సినిమాలేవి రావ‌డం లేదు కాబ‌ట్టి ఓటీటీలో వ‌చ్చే సినిమాల‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు చూస్తే.. 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫైటర్ (హిందీ సినిమా) – మార్చి 21, బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 22, షిర్లే (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 22, ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లిష్ సినిమా)- మార్చి 22 నుండి లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) మార్చి 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూస్తే.. ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా)- మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, రోడ్ హౌజ్ (ఇంగ్లిష్ సినిమా)- మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్‌ సినిమా)- మార్చి 20 నుండి, సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్)- మార్చి 20, ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మార్చి 20, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లిష్ మూవీ)- మార్చి 22, డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మార్చి 22, లూటేరే (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 22, ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- మార్చి 24 స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక బుక్ మై షోలో ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లిష్‌ సినిమా) – మార్చి 19 నుండి స్ట్రీమ్ అవుతుంది. జియో సినిమాలో ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 21 నుండి స్ట్రీమ్ కానుంది. ఆపిల్ ప్లస్ టీవీ లో ఆర్గిల్లీ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 23 నుండి స్ట్రీమింగ్‌కి రానుంది.

Exit mobile version