Site icon vidhaatha

ఈ ఏడాది బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి పెళ్లి పీట‌లెక్కిన సినీ తార‌లు ఎవ‌రంటే..!

టాలీవుడ్‌లో కొందరు సినీ తార‌లకి మూడు ప‌దుల వ‌య‌స్సు దాటిన కూడా పెళ్లిపై ఆస‌క్తి చూప‌కుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం వారు బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్ప‌క త‌ప్ప‌లేదు.2023 లో బ్రహ్మచర్యానికి గుడ్ బై చెప్పిన తార‌ల‌లో ముందుగా చెప్పుకోవల్సింది వరుణ్ తేజ్ లావణ్య గురించే. దాదాపు 6 ఏళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట..జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకొని పెద్ద షాక్ ఇచ్చారు.ఇక‌ నవంబర్ 1న ఇంటలీలోని చారిత్రాత్మక గ్రామంలో ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. దీంతో లావ‌ణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడ‌లు అయింది. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మ‌రో బ్యాచిల‌ర్ హీరో ఎవ‌రంటే శ‌ర్వానంద్. చాలా ఏళ్లుగా శ‌ర్వానంద్ పెళ్లి గురించి అనేక వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

అయితే ఎట్ట‌కేల‌కి 2023లో తాను ప్రేమించిన రక్షితా రెడ్డిని.. జూన్ 2 న రాజస్థాన్ లోని జైపూర్ లో ఘనంగా పెళ్లాడాడు. ఇక ఈ ఏడాదే శ‌ర్వానంద్ తండ్రి కూడా కాబోతున్నట్టు టాక్ న‌డుస్తుంది. బాలీవుడ్ జంట కియారా అద్వాని -సిద్దార్ధ్ మల్హోత్ర 2023 లో పెళ్లి చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చారు. చాలా ఏళ్లుగా వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉండ‌గా, ఎక్క‌డ కూడా త‌మ ప్రేమ గురించి నోరు విప్ప‌లేదు. అయితే చిన్న‌పాటి హింట్స్ మ‌త్రం ఇచ్చారు. అయితే అందరి అనుమానాల‌కి తెర‌దించుతూ ఫిబ్రవరి 7న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో కనిపించిన మానస్.. బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు.

రీసెంట్‌గా విజయవాడలో శ్రీజ మెడలో మూడు ముళ్లు వేసి.. తన లైఫ్ పార్ట్ నర్ గా వెల్కం చెప్పాడు మాన‌స్. వీరి పెళ్లిళో బుల్లితెరతారలు సందడిచేశారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక ఈ ఏడాది పెళ్ళి పీటలు ఎక్కిన మరో హీరో మంచు మోహన్ బాబు కాగా, ఇది ఇత‌నికి రెండో పెళ్లి. తాను ప్రేమించి మౌనిక రెడ్డిని మార్చి 3న మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. ఇక సీనియర్ నటి పవిత్ర లోకేష్ కూడా ఈ ఏడాది న‌రేష్‌ని పెళ్ళి చేసుకున్నారని టాక్ న‌డుస్తుంది. ఇది న‌రేష్‌కి నాలుగో పెళ్లి. ఇక వీరే కాకుండా ఇండ‌స్ట్రీలో ప‌లువురు పెళ్లి పీట‌లెక్కారు. వారు కూడా అట్ట‌హాసంగా త‌మ పెళ్లి వేడుక జ‌రుపుకున్నారు. మ‌రి వ‌చ్చే ఏడాది ఎవ‌రు బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెబుతారో చూడాలి.

Exit mobile version