Site icon vidhaatha

బిగ్ బాస్ గ్యాంగ్‌తో జల్సాలు.. ఆ దుర‌ల‌వాట్లే సూర్య కిర‌ణ్ మృతికి కార‌ణ‌మంటూ నిర్మాత సంచ‌ల‌న కామెంట్స్

బాల న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత స‌త్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నారు సూర్య కిర‌ణ్‌. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న చేసిన సినిమాలేవి పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత బిగ్ బాస్ సీజ‌న్ 4తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. అయితే హౌజ్‌లో ఉన్న‌ది వారం రోజులే అయిన కొంద‌రితో బాగా క‌నెక్ట్ అయ్యాడు. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా వారి గురించి మంచిగా మాట్లాడుతూ స్నేహం కొన‌సాగించాడు. అయితే అనారోగ్యం వ‌ల‌న సోమవారం సూర్య కిర‌ణ్ మృతి చెంద‌గా, ఆయ‌న అంత్య‌క్రియ‌లు మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

అయితే చిన్న వ‌య‌స్సులో సూర్య కిర‌ణ్ మృతి చెంద‌డం చాలా మందిని క‌లిచి వేస్తుంది. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు ఆయ‌న మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. సూర్య కిర‌ణ్ దుర‌ల‌వాట్ల‌కి బానిస కాక‌పోతే కొన్నాళ్లు బ్రతికేవాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. తెలుగు నిర్మాత చిట్టిబాబు రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మృతిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసాడు.అతిగా మందు, సిగ‌రెట్లు తాగి జ‌ల్సాలు చేయ‌డం వ‌ల్ల‌నే అత‌నికి ప‌చ్చ కామెర్లు వ‌చ్చాయ‌ని వాపోయారు. ఒక‌సారి వ‌చ్చిన జాండిస్ కొన్నాళ్ల‌కి త‌గ్గిపోయాయి. అప్పుడైన ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకుంటే బాగుండేది.

కాని ఆయ‌న బిగ్ బాస్ గ్యాగ్, డ్ర‌గ్స్ గ్యాంగ్‌తో క‌లిసి పార్టీలు ఎక్కువ చేసుకునేవారు. అత‌ని స్నేహాలు బాగా దుర‌ల‌వాట్ల‌ని ప్రోత్స‌హించేవిగా ఉండేవి. బిగ్ బాస్ ఫ్రెండ్స్ వ‌ల‌న బాగా దుర‌ల‌వాట్లు పెరిగాయ‌ని, దాని వ‌ల‌న ఆరోగ్యంపై నిర్ల‌క్ష్యం వ‌హించాడ‌ని చిట్టిబాబు అన్నారు.ఆయ‌న గురించి ప‌ట్టించుకునే వారు కాని, అత‌నికి మంచి చెడులు చెప్పేవారు కాని ఎవ‌రు లేరు. చెప్పిన అత‌ను వినే ర‌కం కాదు. చాలా సార్లు అత‌నికి మంచి చెప్పిన ఎప్పుడు విన‌లేదు. ఎవ‌రు చెప్పిన కూడా అత‌డు విన‌డు. తాగుడు వ‌ల్ల‌నే ఆయ‌నకి జాండిస్ తిర‌గ‌బ‌డింది. ఆయ‌న అజాగ్ర‌త్త వ‌ల్ల‌నే ప్రాణం పోయింద‌ని చిట్టిబాబు స్ప‌ష్టం చేశారు. ఇక కరాటే క‌ల్యాణి కూడా రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సిగ‌రెట్స్ , మద్యం వ‌ల్ల‌నే ఆయ‌న మృతి చెందార‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version