Site icon vidhaatha

అట్ట‌హాసంగా జ‌రిగిన సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివ‌ల్‌..తార‌ల సంద‌డితో క‌ళ‌క‌ళ‌లాడిన ప్రాంగ‌ణం

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఏడాది స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, ఆయ‌నతో పాటు టాలీవుడ్ లోని పలువురు దర్శకనిర్మాతలతో పాటు నటీనటులు కూడా హాజరయ్యారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ కార్యక్రమం ఘ‌నంగా జ‌రిగింది. ఇక ఈ కార్య‌క్ర‌మంలో పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవిని చిత్ర సీమ‌కి చెందిన ప్ర‌ముఖులు స‌త్క‌రించారు. చిరంజీవిని గౌరవ ప్రతిమలు అందించి, శాలువాతో స‌త్క‌రించారు ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్, టీజీ విశ్వ ప్ర‌సాద్, ముర‌ళీ మోహ‌న్, త‌నికెళ్ల భ‌ర‌ణి.

ఈవెంట్‌లో మాట్లాడిన ముర‌ళీ మోహ‌న్.. అల్లు అర్జున్‌కి ఉత్తమనటుడు అవార్డు వ‌చ్చిన కూడా చిత్రసీమ సన్మానించలేదు ఎందుకని..? ఇప్పుడు మెగాస్టార్ ని అయినా సన్మానించినందుకు సంతోషం. మేము చెన్నైలో ఉండేటప్పుడు ఇలా ఉండేది కాదు అని అస‌హ‌నం వ్యక్తం చేశారు ముర‌ళీ మోహ‌న్. ప్ర‌స్తుతం మ‌ర‌ళీ మోహ‌న్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్‌లో హ‌నుమాన్‌తో మంచి హిట్ కొట్టిన‌ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జ.. చిరంజీవి హిట్స్ సాంగ్స్ కి డాన్స్ వేసి గ్రేట్ ట్రిబ్యూట్ ఇచ్చారు. మంచు ల‌క్ష్మీ కూడా త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకుంది.

ఇక చిరంజీవి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్‌లో ఆయ‌న ఎన్నో అవార్డులు అందుకున్నారు. సినిమాల‌తోను, సేవా కార్య‌క్ర‌మాల‌తోను ఎంతో మంది మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో యువ హీరోల‌కి త‌న వంతు స‌పోర్ట్ అందిస్తూ వ‌స్తున్నారు. చిన్న హీరోల మూవీల ఫంక్ష‌న్స్‌కి చిరంజీవి స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌రై మూవీని జ‌నాల‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు. మ‌రోవైపు సినిమాల‌తోను ఎంత‌గానో అల‌రిస్తున్నారు. వశిష్ట ద‌ర్శ‌కత్వంలో విశ్వంభ‌ర అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Exit mobile version