Site icon vidhaatha

Vishwambhara | చిరంజీవి ‘విశ్వంభ‌రలో హీరోయిన్ ఫిక్స్‌..!

Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం విశ్వంభ‌ర‌. ఈ చిత్రం మెగాస్టార్‌కు 156వ చిత్రం కావ‌డం విశేషం. సోష‌ల్ ఫాంట‌సీ చిత్రానికి విశిష్ఠ మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుంటార‌నే తేలిపోయింది. చిరంజీవితో త్రిష మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోమ‌వారం చిరంజీవి ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్​​ చేశారు. త్రిష విశ్వంభ‌ర సెట్స్‌లో అడుగుపెట్టిన ఆయ‌న షేర్ చేయ‌గా.. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

గ‌తంలో చిరంజీవి, త్రిష 2006లో స్టాలిన్ చిత్రంలో క‌లిసి న‌టించారు. మ‌ళ్లీ 17 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ జోడీ బిగ్ స్క్రీన్‌పై అల‌రించ‌బోతున్న‌ది. ప్రస్తుతం మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ నెల 9 నుంచి సాంగ్ షూట్ చేయనున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేక‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా.. త్రిష పొన్నియ‌న్ సెల్వ‌న్ సిరీస్‌లో న‌టించింది. చివ‌ర‌గా లియోలో విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది.

Exit mobile version