Site icon vidhaatha

త్రిషని రేప్ చేయాల‌ని ఉందన్న మ‌న్సూర్.. గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన చెన్నై చంద్రం

చెన్నై చంద్రం త్రిష గురించి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వైవిధ్య‌మైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. అయితే నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న త్రిష‌పై మ‌న్సూర్ అలీ ఖాన్ నోరు పారేసుకున్నాడు. గతంలో తమన్నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ఇత‌ను ఇప్పుడు త్రిష‌ని కూడా దారుణంగా అన్నాడు. దీంతో అతడికి త్రిష గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసింది. త్రిష రీసెంట్‌గా న‌టించిన చిత్రం లియో కాగా, ఇందులో మ‌న్సూర్ ఓ కీల‌క పాత్ర పోషించాడు.

లియో స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో మ‌న్సూర్ ఓ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ ఆ ఇంట‌ర్వ్యూలో త్రిషను ఉద్దేశించి కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూమ్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాడు. బెడ్ రూమ్‌కి చేతుల‌తో ఎత్తుకొని తీసుకెళ్ల‌చ్చ‌ని భావించాను. గ‌తంలో చాలా రేప్ సీన్స్ చేశాను. కాని నాకు కాశ్మీర్ షెడ్యూల్ సెట్స్‌లో త్రిష‌ని క‌నిపించ‌కుండా చేశారు అంటూ వెకిలిగా న‌వ్వుతూ ప‌లు కామెంట్స్ చేశాడు. ఇత‌ను అలా మాట్లాడ‌డంపై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోషల్ మీడియాలతో అత‌ను మాట్లాడిన మాట‌ల‌కి సంబంధించిన వీడియో వైరల్ కావ‌డంతో అత‌నిపై దుమ్మెత్తిపోసారు.

ఇక ఆ వీడియో త్రిష ద‌గ్గ‌రకు కూడా చేర‌డంతో త్రిష కూడా తీవ్రంగా స్పందించింది. ‘అవమానకరంగా, స్త్రీద్వేషంతో కూడిన అసహ్యకరమైన మాటలుగా, జుగుప్సాకరంగా ఉన్నాయి’ అని త‌న సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది. మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా మరియు అసహ్యంగా మాట్లాడిన మాట‌ల‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది సెక్సిస్ట్, అగౌరవం, స్త్రీ ద్వేషం అత‌ని మాట‌ల‌లో క‌నిపిస్తుంది. అలాంటి వ్య‌క్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇంతకాలం పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అతనితో నటించకుండా జాగ్ర‌త్త ప‌డ‌తాను. మ‌గ‌జాతికి ఇలాంటి వారే మచ్చ తెస్తార‌ని త్రిష తీవ్రంగా ఫైర్ అయింది. 

Exit mobile version