Site icon vidhaatha

గ‌డ్డం తీసేసి స‌రికొత్త లుక్‌లో క‌నిపించిన గురూజీ.. త్రివిక్ర‌మ్ న్యూ లుక్‌కి అంతా ఫిదా

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రు అని చెప్పాలి. ర‌చ‌యిత నుండి ఇంత పెద్ద ద‌ర్శ‌కుడిగా మారిన త్రివిక్ర‌మ్ వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. రీసెంట్‌గా గుంటూరు కారం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం దాదాప 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక త్వ‌ర‌లో అల్లు అర్జున్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎక్క‌డ క‌నిపించ‌లేదు.

మూవీ స‌క్సెస్ మీట్ స‌మ‌యంలోను త్రివిక్ర‌మ్ క‌నిపించ‌లేదు. అప్పుడు అంద‌రు కూడా త్రివిక్ర‌మ్ ఎందుకు లేడు అని అనుమానాలు వ్య‌క్తం చేశారు. అయితే తాజాగా చిరంజీవి ఇంట్లో త్రివిక్ర‌మ్ ప్ర‌త్య‌క్షం కాగా, అత‌ని న్యూ లుక్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇందులో త్రివిక్ర‌మ్ గ‌డ్డం లేకుండా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని నిర్మాత చినబాబు ఇద్దరూ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన సందర్భంగా ఆయ‌న‌ని క‌లిసి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు. ఈ భేటీలో త్రివిక్రమ్ లుక్ చూసి అంద‌రు షాక్ అవుతున్నార‌… ఎపుడూ గుబురు గడ్డంతో కనిపించే గురూజీ ఈసారి గడ్డం లేకుండా స్మార్ట్ లుక్ లో అదరగొడుతున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పిక్స్‌లో క‌నిపిస్తున్నారు.

త్రివిక్రమ్ కి ఫుల్ వైట్ గడ్డం ఉంటుందిది. అయినా స్టైలిష్ గా ఉంటారు. త‌న లుక్‌తో క‌ట్టిప‌డేస్తుంటారు. అయితే ఇప్పుడు గ‌డ్డం లేక‌పోయిన కూడా త్రివిక్ర‌మ్ లుక్ అదుర్స్ అంటూ మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి త్రివిక్ర‌మ్ ఇలా క్లీన్ ట్రిమ్ చేయ‌డానికి కార‌ణం ఏంట‌బ్బా అని నెటిజ‌న్స్ ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం ద‌క్కిన ఆయ‌నని క‌లిసిన వారిలో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ, యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. 

Exit mobile version