Site icon vidhaatha

క్రిస్మ‌స్ సెల‌బ్రేషన్స్‌లో ఉపాస‌న వేసుకున్న డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ తిరిగిపోవ‌డం ఖాయం..!

మెగా కోడ‌లు ఉపాస‌న ఇటీవలి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఈ ఏడాది పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఉపాస‌న ఎక్కువ‌గా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ తెగ సంతోషం వ్య‌క్తం చేస్తుంది. ఇక ఉపాస‌న బ‌య‌ట‌క‌నిపించిన‌ప్పుడ‌ల్లా అంద‌రి దృష్టి ఆమెపైనే ఉంటుంది. ఏదో ర‌కంగా ఉపాస‌న అంద‌రి అటెన్ష‌న్‌ని త‌న వైపుకు తిప్పుకుంటుంది. ఇటీవలే మెగా ఫ్యామిలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకోగా, ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు మెగా కోడళ్ళు కూడా సందడి చేశారు. అయితే ఆ వేడుక‌లో ఉపాస‌న ధ‌రించిన డ్రెస్ ఖ‌రీదు తెలిసి ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ల‌పెడుతున్నారు.

అల్లు మెగా ఫ్యామిలీ క‌లిసి జ‌రుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సందడిచేశారు. హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసంలోఈ ఈవెంట్‌ గ్రాండ్ గా జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో స్టార్ హీరోల భార్యలు ఉపాసన కొణిదెల, అల్లు స్నేహా రెడ్డి, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై సందడి చేయ‌గా, ఉపాస‌న వేసుకున్న డ్రెస్ మాత్రం స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది. లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించిన డ్రెస్ ఉపాస‌న వేసుకుంద‌ని వాటి ధర రూ. 3 లక్షలు అని తెలుస్తోంది. మ‌రి ఉపాస‌న రేంజ్‌కి ఈ మాత్రం మెయింటైన్ చేయాల‌ని కొంద‌రు అంటున్నారు.

2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈ ఏడాది జూన్ 20న తమ మొదటి బిడ్డకు జన్మానించారు. ఆ పాపకు క్లింకారా అని పేరు పెట్టారు. ఇటీవ‌ల పాప‌కి ఆరేళ్లు పూర్తైన సంద‌ర్భంగా ముంబైలోని ఓ ఆల‌యానికి వెళ్లి పూజ‌లు చేశారు.ఆ స‌మ‌యంలో క్లింకారా ఫేస్ రివీల్ చేయాల‌ని కెమెరా మెన్స్ ఎంత ప్ర‌య‌త్నించిన కూడా కుద‌ర‌లేదు. క్లింకార ఫేస్ క‌నిపించ‌కుండా ఉపాస‌న చాలా జాగ్ర‌త్త‌గా క‌వ‌ర్ చేసింది. ఇక రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసిన విష‌యం తెలిసిందే. అప్పుడు దిగిన పిక్స్ ఇప్ప‌టికీ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

Exit mobile version