Site icon vidhaatha

రెండో బిడ్డ‌ని క‌న‌బోతున్నాను.. మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని పెంచే విష‌యం చెప్పిన ఉపాస‌న‌

ఉపాసన గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణిగానే కాకుండా సామాజిక కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కి చాలా ద‌గ్గ‌ర అవుతుంది. సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఉపాసన మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. అయితే రామ్ చ‌ర‌ణ్‌ని పెళ్లి చేసుకున్న 11 ఏళ్ల‌కి పండంటి బిడ్డ‌కు ఉపాస‌న జ‌న్మనిచ్చిన విష‌యం తెలిసిందే. వీరు పెళ్లి త్వరగానే చేసుకున్నప్పటికీ.. పిల్లల విషయంలో ఏ మాత్రం తొంద‌ర‌ప‌డ‌కుండా ప్లానింగ్ చేసుకున్నారు. అయితే క్లింకార‌ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఉపాస‌న తాజాగా మెగా ఫ్యాన్స్‌కి ఆనంద‌క‌ర‌మైన విష‌యం చెప్పింది.

ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఉపాస‌న‌.. త్వ‌ర‌లోనే రెండో బిడ్డ‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు పేర్కొంది. ఓ కార్యక్ర‌మంలో మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ.. తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని చెప్పుకొచ్చింది. తన పక్కనున్న మేడమ్‌ కూడా లేట్‌ గానే పిల్లలు కావాలనుకున్నారని , ఈ నిర్ణ‌యం తీసుకున్నందుకు త‌న‌కేమి బాధ‌లేద‌ని చెప్పింది. ఎవ‌రి ఇష్టం వారిది అంటూ చెప్పిన ఉపాస‌న తాను సెకండ్‌ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నానని గుడ్ న్యూస్ చెప్పింది.. చూస్తుంటే ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పనుందా అంటూ అంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న 2012లో జూన్ 14వ తేదీన ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఈ ఇద్ద‌రికి పెళ్లి జరిగిన తర్వాత చాలా మంది వీరిని ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా ఉపాసన అందంపై దారుణ‌మైన కామెంట్స్ చేశారు. కాని వాటిని ప‌ట్టించుకోకుండా వారు ఇద్ద‌రు సంతోషంగా జీవిస్తున్నారు. ఉపాస‌న మంచి పనులు చేస్తూ అటు పుట్టినింటి, ఇటు మెట్టినింటి గౌరవం కాపాడుకుంటూ వస్తుంది. తల్లిగా అయ్యాకా.. తనకు కాస్త బాధ్యతలు పెరిగాయంటున్న ఉపాస‌న అన్నింటిని చక్క‌బెట్టుకుంటున్న‌ట్టు కూడా పేర్కొంది. రామ్ చ‌ర‌ణ్ నేను ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాం.., గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒకరి కెరీర్ లో ఒకరు ఇవాల్వ్ అవ్వం.. వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒక్కటిగా ఉంటాం అని చెప్పుకొచ్చింది ఈ మెగా కోడ‌లు

Exit mobile version