టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోగా పెళ్లైన పదకొండేళ్లకి వారికి క్లింకార అనే కూతురు జన్మించింది. ప్రస్తుతం ఆ కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ సంతోషంగా గడుపతున్నారు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా రామ్ చరణ్, ఉపాసనలు ఒకరిపై ఒకరు తెగ ప్రేమని కురిపించుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ తనని బాగా అర్ధం చేసుకుంటారని, తన సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుందని కూడా ఉపసాన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక క్లీంకార తన తండ్రి అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుందని, చెర్రీని చూడటంతోనే కను రెప్పలు ఆడిస్తుందని చెప్పుకొచ్చింది. చిన్నపాటి నవ్వు కూడా నవ్వుతుందట. అదంతా చూసి తనకు జెలసీగా ఉంటుందని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇక తనది, రామ్ చరణ్‌ది రెండు వేర్వేరు ప్రపంచాలు అని చెప్పిన ఉపాసన పెళ్లయిన కొత్తలో భర్త రామ్ చరణ్ వర్క్‌ను అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉండేదని పేర్కొంది. చరణ్ ఇంటిమేట్ సీన్స్ వల్ల పెళ్ళైన కొత్తలో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగేవని తాజాగా పేర్కొంది ఉపాసన. రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో. ఆయన చిరుత సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే ఆయన కొన్ని సినిమాలలో హీరోయిన్స్‌తో చాలా క్లోజ్‌గా ఉండడం, రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉండడం ఉపాసన అస్సలు జీర్ణించుకోలేకపోయిందట. చరణ్‌ని అలాంటి సీన్స్ ఎందుకు చేస్తున్నావంటూ పలుమార్లు ప్రశ్నించిందట ఉపాసన.
హీరోయిన్స్‌తో తెగ రొమాన్స్ చేస్తున్న రామ్ చరణ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసనఇలాంటి సీన్స్ చేయడం అవసరమా అంటూ ఒక్కోసారి చరణ్‌పై కస్సుబుస్సులు కూడా ఆడిందట ఉపాసన. అయితే ఉపాసన పరిస్థితిని అర్ధం చేసుకున్న రామ్ చరణ్.. సినిమాలలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది క్లియర్‌గా వివరించాడట. తన ప్రొఫెషన్ ఇది అని, దానిని తప్పుగా అర్ధం చేసుకోవద్దు . ఇది సినిమా మాత్రమే బయట అలా జరగదు అంటూ ఉపాసనకి నమ్మకం కలిగేలా వివరించాడు. రామ్ చరణ్ మాటలకి ఉపాసన కరిగిపోయి ఇక అప్పటి నుండి ఆయన వర్క్ విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోదట. ఉపాసన అంత అర్ధం చేసుకుంది కాబట్టే ఇప్పుడు రామ్ చరణ్ ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యపీగా సినిమాలు, బిజినెస్‌లు చేసుకుంటూ వెళుతున్నాడు.