Site icon vidhaatha

ఈ వారం చిన్న చిత్రాల‌దే హ‌వా.. థియేట‌ర్, ఓటీటీలో ఏయే సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయంటే..!

ప్ర‌తి వారం ఓటీటీ, థియేట‌ర్‌లో వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ వారం కూడా ప‌లు ఇంట్రెస్టింగ్ మూవీస్ ప్రేక్ష‌కులని అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థ్రిల్లర్‌లు, రియల్ డ్రామాలు, స్పోర్ట్స్ డ్రామాలు, డాక్యుమెంటరీలు, హై ఓల్టేజ్ యాక్షన్లు మంచి థ్రిల్ అందించేందుకు సై అంటున్నాయి. ముఖ్యంగా సంచలనం సృష్టించిన కూతురు షీనా బోరా దారుణ హత్య కేసులో అరెస్టయిన మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ ముఖర్జీ పై హిందీ డాక్యుమెంటరీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మార‌నుంది. ఇక మోహన్ లాల్ నటించిన ‘మలకోట్టై వాలిబన్’ అనే మలయాళ సినిమా, ఏనుగు దంతాల స్మగ్లర్స్ తో ‘పోచర్స్’ వెబ్ సిరీస్, కన్నడ మూవీ ‘అధర్వ’పై కూడా చాలా మందికి ఫోక‌స్ ఉంది.

ఇక థియేట‌ర్ సినిమాల విష‌యానికి వ‌స్తే వైవ హర్ష నటించిన సుందరం మాస్టర్‌ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా! ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా దీపక్‌ సరోజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సిద్ధార్థ్‌ రాయ్ కూడా ఫిబ్రవరి 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీటితో పాటు విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా నటించిన ముఖ్య గమనిక అనే చిత్రం కూడా ఫిబ్రవరి 23న సంద‌డి చేయ‌నుంది.అందాల తార యామీ గౌతమ్ ఆర్టిక‌ల్ 370తో ఫ్రిబ‌వ‌రి 23న ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈ చిత్రాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుండ‌గా, మ‌రోవైపు ఓటీటీలో కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్ సంద‌డి చేయ‌బోతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ లో కెన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్ (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22, సౌత్‌ పా- (ఇంగ్లీష్ మూవీ) -ఫిబ్రవరి 22 , థ్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యూ -(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23 నుండి, మీ కుల్పా- (నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23 , ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్ 6 -(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23 , ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ -(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23 , ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ వన్స్- (సైన్స్ షో)- ఫిబ్రవరి 23 , మార్షల్ ది షెల్ విత్ షూస్ ఆన్ –(ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్‌లో అపార్ట్మెంట్ 404 -(కొరియన్ మిస్టరీ డాక్యుమెంటరీ)- ఫిబ్రవరి 23 నుండి స్ట్రీమ్ కానుంది.పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23, మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23 ,అధర్వ –(కన్నడ మూవీ0- ఫిబ్రవరి 25నుండి స్ట్రీమ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో కాన్స్టెలేషన్ – (అంతరిక్ష థ్రిల్లర్ డ్రామా)- ఫిబ్రవరి 23 నుండి స్ట్రీమ్ కానుంది.

Exit mobile version