Site icon vidhaatha

ఈ వారం థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో దుమ్ము రేపే సినిమాలు ఇవే.. అస్స‌లు మిస్ కావొద్దు..!

ఇప్పుడు ప‌రీక్షా స‌మ‌యం కావ‌డంతో థియేట‌ర్‌లో పెద్ద సినిమాలు రావ‌డం లేదు. చిన్న చిత‌కా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు మంచి విజ‌యం సాధిస్తున్నాయి. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తే ముందుగా .. ‘టిల్లు స్క్వేర్‌’ ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. అలాగే, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడు జీవితం’ మార్చి 28న రిలీజ్ కానుంది. ఇక గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్‌: ది న్యూ ఎంపైర్ అనే సినిమా మార్చి 29న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు ప‌లు భార‌తీయ భాషల్లో విడుద‌ల‌ కానుంది. ఈ చిత్రాల‌లో టిల్లు స్క్వేర్ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.ఇక ఓటీటీల విష‌యానికి వ‌స్తే..సుంద‌రం మాస్ట‌ర్‌, ఏం చేస్తున్నావ్‌?, ట్రూ ల‌వ‌ర్ చిత్రాల‌పై అభిమానులు కాస్త ఆస‌క్తి చూపుతున్నారు.

నెట్‌ఫ్లిక్స్ లో టెస్టామెంట్‌ (వెబ్‌సిరీస్) మార్చి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుండ‌గా, హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్) మార్చి 29 వ తేదీ నుంచి , ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) మార్చి 29 వ తేదీ నుంచి, ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) మార్చి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో టిగ్ నొటారో (వెబ్‌సిరీస్‌) – మార్చి 26 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక ది బాక్స్‌ట‌ర్స్ (వెబ్‌సిరీస్‌) – మార్చి 28 నుండి స్ట్రీమ్ కానుంది. డిస్నీ+హాట్‌స్టార్ లో చూస్తే .. పట్నా శుక్లా (హిందీ)మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుండ‌గా, రెనెగడె నెల్ల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమ్ అవుతుంది. బుక్‌ మై షో లో ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమాలో ఎ జెంటిల్‌మ్యాన్‌ ఇన్‌మాస్క్‌ (వెబ్‌సిరీస్‌)మార్చి 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘గుడ్‌నైట్‌’, ‘జై భీమ్’ వంటి చిత్రాల‌లో త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ‘ట్రూ ల‌వ‌ర్‌ మార్చి 27 నుంచి ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్ కానుంది. ఇక వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌లోరూపొందిన ‘సుంద‌రం మాస్ట‌ర్’ ప‌ర్వాలేద‌నిపించింది. ఈ మూవీ ఇప్పుడు ఆహాలో మార్చి 28వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. గ‌తేడాది ఆగ‌స్టు 25న‌ థియేట‌ర్ల‌లో విడుద‌లైన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఏం చేస్తున్నావ్‌? ఈ నెల 28 నుంచి ‘ఈటీవీ విన్‌’లో ప్ర‌సారం కానుంది. విజ‌య్ రాజ్‌కుమార్, నేహా ప‌టాని జంట‌గా భ‌ర‌త మిత్ర ఈ మూవీని తెర‌కెక్కించారు.

Exit mobile version