మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరి కొద్ది రోజులలో ఒకింటివాడు కానున్నాడు. అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠితో ఐదారేళ్లపాటు ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ జూన్ 9న నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇక వీరి వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్నట్టు తెలుస్తుంది. వరుణ్- లావణ్యల పెళ్లి పనులన్నింటిని ఉపాసన చూసుకోనుందని సమాచారం. అయితే వరుణ్- లావణ్యలకి చిరంజీవితో పాటు అల్లు అర్జున్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిహారిక విడాకుల తర్వాత వరుణ్ తేజ్ వివాహం చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి ఆయన డ్రెసింగ్, కాస్టూమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా పలు వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి కన్నా ముందు బుట్టబొమ్మ పూజా హెగ్డేతో ప్రేమాయణం నడిపాడని కొందరు చెప్పుకొస్తున్నారు. వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద లో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో వారి కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడిచిందనే టాక్ బయటకు వచ్చింది. వీరిద్దరు పలు గిఫ్ట్‌లు కూడా ఇచ్చుకున్నారని, పార్టీలకు కూడా వెళ్లారని ప్రచారం నడుస్తుంది.
ముందు పూజా హెగ్డేని పెళ్లి చేసుకోవాలని వరుణ్ తేజ్ భావించగా, ఆ విషయం తెలిసి నాగబాబు స్మూత్ వార్నింగ్ ఇచ్చారట. తొలి సినిమాతోనే లవ్, పువ్వులు అంటే కెరీర్ నాశనం అవుతుంది. అవన్నీ వదిలేయ్ అని స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చారట. ముందు కెరీర్‌లో సెటిల్ అవ్వు, ఆ తర్వాత ఈ లవ్వుల సంగతి చూద్దామని చెప్పారట. అయితే కొద్ది రోజులకి మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు ఆమెతో డేటింగ్ చేసి చివరికి జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్నాడు. నవంబర్ 1న లావణ్యని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ కి సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని అంటున్నారు.