Site icon vidhaatha

ఒకవైపు మెగా ఇంట పెళ్లి సంద‌డి.. మ‌రోవైపు ద‌గ్గుబాటి వారింట కూడా పెళ్లి సంద‌డి

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించిన విష‌యం తెలిసిందే. ఐదారేళ్ల‌పాటు ప్రేమ‌లో ఉన్న వీరు ఎట్ట‌కేల‌కు జూన్ 9న నిశ్చితార్థం చేసుకొని న‌వంబ‌ర్ 1న పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పుడు ఈ మెగా పెళ్లి సంద‌డి గురించి జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది.ఇక ఇదే స‌మయంలో ద‌గ్గుబాటి వారింట కూడా పెళ్లి సంద‌డి ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. హీరో వెంకటేష్ రెండు కూతురు పెళ్ళికి సిద్దమవుతున్న‌ట్టుగా ఒక టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ కి మొత్తం నలుగురు పిల్లలు కాగా.. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇక వీరిలో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి చాలా కాలం అయ్యింది.

ఇక వెంకటేష్ రెండో కూతురుకి పెళ్లి చేయబోతున్నట్టు చాలా రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు వెంకి మామ తన రెండో కూతురిని అత్తారింటికి పంపించడానికి సిద్దమవుతున్నాడట. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని టాక్. ఈ ఎంగేజ్మెంట్ కూడా ఈ నెలలోనే జరగబోతుంద‌ని, మ‌రి కొద్ది రోజుల‌లోనే పెళ్లి వేడుక జ‌ర‌పనున్నార‌నే టాక్ వినిపిస్తుంది. నిశ్చితార్థం తరవాత పెళ్లికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తారని చెప్పుకొస్తున్నారు. మరోవైపు, వెంకటేష్ మూడో కుమార్తె భావన ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తుండ‌గా, అర్జున్ దగ్గుబాటి కూడా విదేశాల్లో చదువుకుంటున్నారట.

మ‌రోవైపు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి కూడా జ‌ర‌గ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.అయితే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇది కొంద‌రు నిజ‌మేన‌ని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ సెలబ్రిటీల కుటుంబాలలో వరుసగా పెళ్ళి బాజాలు మోగబోతుండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ వేడుక‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.. మెగా ఫ్యామిలీ, మాగంటి ఫ్యామిలీతో పాటు.. దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. పెద్ద పెద్ద కుటుంబాల్లో వరుసగా పెళ్లి బాజాలు మోగబోతుండ‌డం ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version