లెజండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ స్టార్ హీరోగా ఎంతో మంది మనసులని గెలుచుకున్నాడు. రామానాయుడు నిర్మాతగా దూసుకుపోతున్న సమయంలో వెంకీ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. అయితే వెంకటేష్ హీరోగా కావడం వెనక ఓ స్టోరీ ఉంది. రామానాయుడు నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్‌లలోకి ఎక్కిన విషయం మనందరికి తెలుసు. అయితే ఆయన ఓ సినిమా చేస్తున్న సమయంలో హీరో రామానాయుడికి హ్యండ్ ఇవ్వడంతో విదేశాలలో చదువుకుంటున్న వెంకటేష్‌ని పిలిపించి అతనిని హీరో చేశాడు. అలా టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా, లక్షలాది మంది అభిమానులు ఆరాధించే హీరోగా వెంకటేష్ ఎదిగాడు.
టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన వెంకటేష్ అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా నిలిచారు. వెకంటేష్ సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కి అతనిని దగ్గర చేశాయి. వెంకటేష్ అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోలని కూడా తట్టుకొని స్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతూ ఉంటారు. తాజాగా వెంకటేష్ ఆస్తులకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వెంకటేష్‌కి 2200కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆయన టాలీవుడ్‌లోనే రెండో అతిపెద్ద సంపన్నుడు అని కొన్ని లెక్కలు చెబుతుండగా, ఇది విని అందరు షాక్ అవుతున్నారు. నాగార్జున తర్వాత టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు వెంకీనే అంటున్నారు.
హైదరాబాద్‌లో వెంకీకి లగ్జరీ హోమ్ ఉండగా, అది కోట్ల విలువ చేస్తుంది అని అంటున్నారు. ఇక రామానాయుడు స్టూడియో తో పాటు హైదరాబాద్ లో రెండు స్టూడియోలు, వైజాగ్‌లో ఓ స్టూడియో వెంకీకి ఉందని సమాచారం. వీటితోపాటు లగ్జరీ కార్లు, బైకులు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వెంకీ భారీగానే పెట్టుబడులు పెట్టారట. వంద ఎకరాల భూములు కొన్నారని, మద్రాసులో పలు ల్యాండ్స్ ఉన్నాయని, హైదరాబాద్‌లో కూడా కొన్ని చోట్ల కొనుగోలు చేసారని సమాచారం. సురేష్ బాబుతో కలిసి కొన్ని పెట్టుబడులు వెంకీ పెట్టినట్టు తెలుస్తుండగా, అవి ఇటీవలి కాలంలో పంచుకున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే రెండు వేల కోట్లకుపైగా వెంకీ ఆస్తులు ఉంటాయని అంటున్నారు. అయితే వెంకటేష్‌కి ఎంత ఆస్తులున్నా ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్ల వివాహం చేయగా, అర్జున్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.