Site icon vidhaatha

ప్ర‌భాస్ ఆరోగ్యం గురించి నేను చెప్పింది నిజం.. మీకెం తెలుసురా వెద‌వ‌ల్లారా అంటూ వేణుస్వామి ఫైర్

వేణు స్వామి.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాగ చైత‌న్య‌, స‌మంత విడాకుల గురించి ముందుగానే కామెంట్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.అయితే వేణు స్వామి చెప్పిన‌ట్టు వారిద్ద‌రు నిజంగానే విడాకులు తీసుకోవ‌డంతో వేణు స్వామికి చాలా పాపులారిటీ ద‌క్కింది. ఆయ‌న ఇటీవ‌ల పలువురు సెల‌బ్రిటీల గురించి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తూ ట్రోల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కాడని, కేటీఆర్ సీఎం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు అవాస్త‌వాలుగా మిగిలాయి. ఇక ప్ర‌భాస్ న‌టించిన‌ సలార్ మూవీ విషయంలో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఆదిపురుష్ పరాజయం తర్వాత వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభాస్ కెరీర్ నిలబడదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తన కెరీర్ లో చూడాల్సిన పీక్ హైట్స్ చూసేశారు. డౌన్ ఫాల్ మొదలయింది. ఇక ప్రభాస్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతుంది అంటూ ఆయ‌న‌పై దారుణ‌మైన కామెంట్స్ చేశారు. అంతేకాదు ప్ర‌భాస్ ఆరోగ్యంపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే స‌లార్ చిత్రం ఇప్ప‌డు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని తెగ ట్రోల్ చేస్తున్నారున‌. పబ్లిసిటీ పిచ్చలో ప్రభాస్ గురించి ఇష్టం వచ్చినట్లు వాగావ్.. ఇక నీ గాలి మాటలు చెల్లవు అంటూ వేణుస్వామిని తిట్టిపోస్తున్నారు.

అయితే ప్ర‌భాస్ అభిమానుల మాట‌ల‌కి హ‌ర్ట్ అయిన వేణు స్వామి..తాజాగా ప్రభాస్ విషయంలో స్పందిస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాను చెప్పిందే నిజం అని వాదిస్తున్నారు. ‘ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము… సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాల్లో 90 శాతం సినిమాలు హిట్లు కొట్టడం….. అంతేగాని విడుదలైన నాలుగు సినిమాలలో ఒకే సినిమా హిట్టు కొడితే ఏమనాలి రా ఆజాము… ఆస్ట్రేలియా ఆజాము.. నాలుగు సినిమాలకి ఒక్క సినిమా హిట్టు కొట్టడం కాదురా ఆజాము ఆస్ట్రేలియా’ అంటూ విరుచుకుపడ్డారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని సలార్ మాత్రమే హిట్ అయింద‌ని వేణు స్వామి అన్నారు. ప్రభాస్ విషయంలో కొన్ని బయటకి వస్తాయి కొన్ని రావు. కానీ నేను చెప్పిందే నిజం. ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పా. ఇటీవలే సర్జరీ కూడా జరిగింది. అందుకే సలార్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభాస్ గురించి నేను చెప్పినవి కొన్ని బయటకి రావు. కానీ అవి లోపల జరుగుతాయి. మీకేం తెలుసురా వెధవల్లారా ప్రభాస్ కి ఉన్న సమస్యల గురించి అంటూ వేణు స్వామి కౌంటర్ ఇచ్చారు.

Exit mobile version