Tamannah Bhatia | తమన్నాతో డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్‌ వర్మ..!

  • Publish Date - March 24, 2024 / 06:19 PM IST

Tamannah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నాకు అభిమానుల్లో మంచి క్రేజ్‌ ఉన్నది. సినిమా ఇండస్ట్రీలోకి ఇంట్రీ ఇచ్చి 19 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటికీ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. 2006లో మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన శ్రీ మూవీతో తెలుగులోకి ఇంట్రీ ఇచ్చింది. చివరిసారిగా తెలుగులో రజనీకాంత్‌ హీరోగా వచ్చిన జైలర్‌ మూవీలో ‘కావాలయ్యా’ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ఇటీవల లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నది. ‘అరణ్మణై- 4’ అనే తమిళ చిత్రంతో పాటు ‘స్ట్రీ-2’ అనే మూవీలో నటిస్తున్నది. ఇక తమన్నా గతేడాది తన బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మను అభిమానులకు పరిచయం చేసిన విషయం విధితమే. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్‌లో ఉండగా.. పెళ్లిపై మాత్రం స్పందించడం లేదు. విరామం దొరికినప్పుడుల్లా టూర్స్‌కు వెళ్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే, త్వరలోనే ఇద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదని తేలిపోయింది.

ఇదిలా ఉండగా.. విజయ్‌ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇందులో తమన్నాతో డేటింగ్‌లో ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇద్దరి రిలేషన్‌ ఎక్కడ మొదలైందో చెప్పుకొచ్చాడు. లస్ట్‌ స్టోరీస్‌ షూటింగ్‌లోనే తమన్నాపై తనకు ప్రేమ పుట్టిందని చెప్పాడు. మరింత ఎక్కువ సమయం గడపాలని ఉందని తమన్నాకు చెప్పాడట. విజయ్‌ వర్మ తన అభిప్రాయం చెప్పాక 20 నుంచి 25 రోజుల తర్వాత మళ్లీ కలుసుకున్నామని.. ఆ తర్వాత డేటింగ్‌కు మొదలైంది చెప్పాడు. 2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్‌కి కొనసాగింపుగా.. ఇటీవల లస్ట్‌ స్టోరీస్‌-2 విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌-తమన్నా ఇద్దరూ జంటగా కనిపించారు. తమన్నా ప్రస్తుతం తెలుగులో ఓదెల-2 నటిస్తున్నది. అలాగే, దటీజ్‌ మహాలక్ష్మి, కాతు కరుప్పు, అరణ్మనై -4లో నటిస్తున్నది. ఇక విజయ్‌ వర్మ చివరిసారిగా మర్డర్‌ ముబారక్‌ వెబ్‌సిరీస్‌లో కనిపించాడు. ప్రస్తుతం ‘ఉల్ జలూల్ ఇష్క్‌లో’ హీరోగా నటిస్తున్నాడు.

Latest News