తమిళ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం.తన ప్రతి సినిమాని తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తూ అశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాడు.అచ్చమైన తెలుగు అబ్బాయి అయిన విశాల్ చెన్నైలో సెటిల్ కావడంతో అక్కడే ఎక్కువగా చిత్రాలు చేస్తున్నాడు. నటుడిగానే కాకుండా తన సొంత నిర్మామ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించాడు కూడా. 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళిచేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నాడు. రెండుసార్లు అతని పెళ్లి ఆగిపోవడంతో ఇక పెళ్లి చేసుకోడేమో అని అందరు అనుకున్నారు.
కాని ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీలో ఎవరో అమ్మాయితో చక్కర్లు కొడుతున్నాడు. న్యూయార్క్ వీధుల్లో అమ్మాయి భుజంపై చేతులు వేసి తిరుగుతుండగా, ఎవరో వారిని తమ కెమెరాలో బంధించారు. అక్కడ కొందరు ఆయను గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే.. షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకున్నారు. అమ్మాయితో కలిసి విశాల్ పరుగులు పెట్టారు. అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. న్యూయార్క్ వీధుల్లో అమ్మాయితో విశాల్ పరుగు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాల్ మళ్లీ రిలేషన్‍షిప్‍లో ఉన్నారని కొందరు అంటుంటే, మరి కొందరు ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగం అయి ఉంటుందని చెబుతున్నారు.
ఇటీవల తన పెళ్ళి ఎప్పుడు అనే ప్రశ్న విశాల్ కి ఎదురు కాగా, అది తరువాత చెపుతానన్నారు. తన దృష్టంతా సినిమాలపైనే అన్నాడు. గతంలో శరత్ కుమార్ తనయ.. వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపించి.. బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత ఓ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరుపుకోగా, నిశ్చితార్థం తర్వాత ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం సోలోగా ఉన్న విశాల్ తన కాన్సన్‌ట్రేషన్ మొత్తం సినిమాలపైనే పెట్టాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న విశాల్ ప్రస్తుతం రత్నం, డిటెక్టివ్2 సినిమాల్లో నటిస్తున్నారు.