Site icon vidhaatha

పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా కూడా వ‌రుణ్ సందేశ్- వితిక‌ల‌కి పిల్ల‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం?

వ‌రుణ్ సందేశ్‌- వితికాలు ఇద్ద‌రు కూడా సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారే. ఒక‌ప్పుడు వ‌రుణ్ సందేశ్ హీరోగా స‌త్తా చాట‌గా, వితికా హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. బిగ్‌బాస్‌ ౩ సీజన్‌లో జంటగా వచ్చిన ఈ జంట ఆ తర్వాత పలు టీవీ షోల్లో సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో వితికా షెరు, వ‌రుణ్ సందేశ్ క‌లిసి న‌టించ‌గా, ఆ స‌మ‌యంలో వారిద్ద‌రు రియ‌ల్ లైఫ్ లో ప్రేమ‌లో ప‌డ్డారు. ఇక 2016, ఆగస్టు 19న వితిక- వరుణ్ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లైన త‌ర్వాత కూడా వితిక త‌న‌దైన శైలిలో గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేస్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. నిహారిక‌తో క‌లిసి విహార యాత్ర‌ల‌కి వెళుతూ అక్క‌డ వివిధ పోజుల‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

వితిక సొంతంగా యూట్యూబ్‌ చానల్ కూడా పెట్టి అందులో తన డైయిలీ రోటిన్‌ నుంచి స్పెషల్‌ డేస్‌ విశేషాలను ఎప్ప‌టిక‌ప్పుడు తెలిజేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా త‌న సొంతింటి క‌ల‌ని కూడా నెర‌వేర్చుకుంది. తాజాగా కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన వీడియోను షేర్ చేయ‌గా,ఈ ఇల్లు వితిక టేస్ట్‌కి త‌గ్గ‌ట్టుగా ఉంది. త‌న టేస్ట్‌కి తగ్గ‌ట్టు ఇంటిని నిర్మించుకోవాలని వితిక ఎప్ప‌టి నుండో భావిస్తుంది. ఇన్నాళ్ల‌కి ఆమె క‌ల నెర‌వేరింది. వీడియోలో నేను ఎప్పుడూ నా స్వంత డబ్బుతో నా స్వంత ఇంటిని నిర్మించుకోవాలని కలలు కన్నాను. కానీ దేవుడు వేరే ప్రణాళిక చేయ‌డంతో పాత ఇంటినే రెనోవేట్‌ చేసుకున్నాను. నా టేస్ట్‌ తగ్గట్టుగా ఈ ఇంటిని దగ్గరుండి డిజైన్‌ చేయించుకున్నాను అంటూ వితిక త‌న వీడియోలో చెప్పుకొచ్చింది.

ఇక పెళ్లి జరిగి దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతున్న కూడా ఇంకా వారికి పిల్లలు లేరు. దీంతో పిల్లల గురించి తరచూ వారికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్ర‌మంలో వితికా తాజాగా స్పందిస్తూ.. మేము పిల్లల గురించి ఇప్పుడు ఏ విధమైనటువంటి ప్లాన్స్ చేయలేదు కానీ 2018 వ సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యానని కానీ 40 డేస్ తర్వాత మిస్ క్యారేజ్ కావ‌డం జ‌రిగింద‌ని వితికా చెప్పుకొచ్చింది. మిస్ క్యారేజ్ అయిన తర్వాత మేము అమెరికా నుంచి ఇండియాకి రావ‌డం జ‌రిగింది. ఇక ఇక్క‌డికి వ‌చ్చాక కొంత మెంట‌ల్‌గా ప్రిపేర్ అయ్యేందుకు స‌మ‌యం తీసుకున్నాం. అయితే పిల్ల‌ల గురించి ప్లాన్ చేయ‌కుండానే మాకు పిల్ల‌లు పుట్టే ఛాన్స్ వ‌చ్చిన కొన్ని కార‌ణాల వ‌ల‌న అది కోల్పోవ‌లసి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ప్లాన్ చేయ‌బోతున్నాం అంటూ వితిక పేర్కొంది.

Exit mobile version