Site icon vidhaatha

తొలి రోజు ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ ఏంటి.. చెపాక్‌లో అద్భుతం చేసింది ఎవ‌రు?

ఎప్పుడెప్పుడు ఐపీఎల్ సీజ‌న్ 2024 మొద‌ల‌వుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా నిన్న రాత్రి ఆరంభ వేడుక‌ల‌తో సీజ‌న్ 17 ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహమాన్ తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించ‌గా, మాతుఝే సలామ్ పాట‌తో రోమాలు నిక్క‌క‌పొడుచుకునేలా చేశాడు.ఇక‌ మరో సింగర్ సోనూ నిగమ్ సైతం అద్భుత‌మైన పాట‌లు పాడి ఉర్రూత‌ల‌గించాడు. అంతకుముందు బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టారు. ఇక సీజన్ ట్రోఫీని డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పట్టుకొచ్చి వేదిక మీద ఉంచాడు. ఇక ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్టేజి పైకి రాగా అందరూ క‌లిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చారు. కళ్లు జిగేల్‌మనిపించే లైట్లు, లేజర్ షోలు, బాణాసంచా విన్యాసాలతో ఐపీఎల్ 2024 సీజన్‌కు తెరలేచింది.

ఇక ఆరంభ వేడుక‌ల‌కి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్,సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్( 23 బంతుల్లో 8 ఫోర్లతో 35) కాస్త రాణించిన కోహ్లీ(20 బంతుల్లో 21) మాత్రం నిరాశ ప‌రిచాడు. యువ వికెట్ కీపర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆరో వికెట్‌కి 95 ప‌రుగులు చేయ‌డంతో ఆర్సీబీ ఆ మాత్రం స్కోరు అయిన సాధించింది. ఎడమచేతి వాటం పేసర్ తన సీఎస్కే అరంగేట్రం మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత‌ని అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసుకున్నాడు..

అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), శివమ్ దూబే(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) , రవీంద్ర జడేజా(17 బంతుల్లో సిక్స్‌తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించ‌డంతో చెన్నై విజ‌యం సులువుగా ద‌క్కింది.ఇక ఆర్‌సీబీ బౌలర్లలో కామెరూన్ గ్రీన్(2/27) రెండు వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.మొత్తానికి ఆర్సీబీ త‌న తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవ‌డం ఫ్యాన్స్‌కి నిరాశ‌ని మిగిల్చింది.


ను గెలిపించారు. దీంతో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు తన రికార్డును పదిలం చేసుకుంది.  

Exit mobile version