Viral Video | ఓ మ‌హిళ చెవిలో అసాధార‌ణ శ‌బ్దాలు.. ఈఎన్‌టీ వైద్యులు షాక్‌

  • Publish Date - October 27, 2023 / 02:19 AM IST

Viral Video | ఓ మ‌హిళ చెవిలో నుంచి అసాధార‌ణ శ‌బ్దాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చెవిలో ఏదో పాకులాడుతున్న‌ట్టు అనిపించింది. ఆ శ‌బ్దాల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేదు ఆమెకు. నాలుగు రోజుల పాటు ఇబ్బంది ప‌డ్డ బాధిత మ‌హిళ‌.. చివ‌ర‌కు ఈఎన్‌టీ ఆస్ప‌త్రికి వెళ్లింది. అక్క‌డ వైద్యులు ఆమెకు స్కానింగ్స్ నిర్వ‌హించ‌గా, చెవిలో స్పైడ‌ర్(సాలీడు) ఉన్న‌ట్లు గుర్తించారు. సాలీడుతో పాటు దాని ఎక్సో స్కెలిట‌న్ కూడా ఉన్న‌ట్లు నిర్ధారించారు. దీంతో ట్యూబ్ ద్వారా స్పైడ‌ర్‌ను దాని ఎక్సోస్కెలిట‌న్‌ను బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న తైవాన్‌లో చోటు చేసుకుంది.

ఇక మ‌హిళ చెవిలో సాలీడు తిరుగుతున్న దృశ్యాల‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతున్న మ‌హిళ చెవిలోకి సాలీడు దూరింది. ఆ త‌ర్వాత అసాధార‌ణ శ‌బ్దాలు వినిపించ‌డంతో, నాలుగు రోజుల పాటు ఇబ్బంది ప‌డింది. చివ‌ర‌కు ఆస్ప‌త్రికి రాగా చెవిలో స్పైడ‌ర్ ఉన్న‌ట్టు గుర్తించి, బ‌య‌ట‌కు తీశామ‌ని వైద్యులు తెలిపారు. అయితే స్పైడ‌ర్ చాలా చిన్న‌దిగా ఉండ‌టంతో ఆమె క‌ర్ణ‌భేరికి ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేద‌న్నారు.

 

Latest News