Site icon vidhaatha

Viral Video | 30 ఏండ్లు ప‌నిమ‌నిషిగా ప‌నిచేసి.. కుమారుడిని పైల‌ట్ చేసిన త‌ల్లి..

త‌న పిల్ల‌లు త‌న‌లా క‌ష్ట‌ప‌డొద్ద‌ని, గొప్ప చ‌దువులు చ‌దివి, స‌మాజంలో గౌర‌వంగా బ‌త‌కాల‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి త‌ల్లిదండ్రులు పిల్ల‌ల చ‌దువు విష‌యంలో ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రు. ఏదో ఒక ప‌ని చేస్తూ.. పిల్ల‌ల చ‌దువుల‌కు కావాల్సిన డ‌బ్బును సంపాదించి పెడుతుంటారు. అంతేకాదు.. త‌మ ఆక‌లిని చంపుకొని, ప‌స్తులుండి త‌మ బిడ్డ‌ల క‌డుపు నింపుతారు. ఆ విధంగా పిల్ల‌లను ఉన్న‌త విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు, మంచి ఉద్యోగం సంపాదించేందుకు అవ‌స‌ర‌మైన వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుతుంటారు త‌ల్లిదండ్రులు. ఆ త‌ర్వాత పిల్ల‌లు ప్ర‌యోజ‌కులై, గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఉద్యోగాలు సంపాదిస్తే.. ఆ పేరెంట్స్ సంతోషానికి అవ‌ధులు ఉండ‌వు. ఆనంద భాష్పాలు రాల్చుతూ త‌మ బిడ్డ‌ల‌ను గుండెల‌కు హ‌త్తుకుంటారు.

ఆ విధంగానే ఓ త‌ల్లి 30 ఏండ్ల పాటు ప‌ని మ‌నిషిగా ప‌నిచేసి.. త‌న కుమారుడి క‌ల‌ను నెర‌వేర్చింది. కుమారుడి చదువుకు కావాల్సిన డ‌బ్బును స‌మ‌కూర్చింది. అత‌ని విద్యకు ఎలాంటి ఆటంకం క‌లిగించ‌లేదు. త‌న త‌ల్లి క‌ష్టాన్ని ఏమాత్రం వృథా చేయ‌కుండా, పైల‌ట్ ఉద్యోగం సాధించి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. త‌న త‌ల్లి ముఖంలో సంతోషం చూసి ఉప్పొంగిపోయాడు కుమారుడు.

ఇక త‌ల్లికి కుమారుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. ఆవిడ విమానంలోకి ప్ర‌వేశించ‌గానే సిబ్బంది టికెట్ చేశారు. అనంత‌రం క‌ర్టెన్ ఓపెన్ చేయ‌గా, పుష్ప‌గుచ్ఛంతో స్వాగ‌తం ప‌లికేందుకు ఉన్న కుమారుడిని చూసి త‌ల్లి ఆనంద‌భాష్పాలు రాల్చింది. మురిపెంగా ముద్దులుపెట్టి కుమారుడిని గుండెల‌కు హ‌త్తుకుంది. పైల‌ట్ డ్రెస్‌లో త‌న బిడ్డ‌ను చూడ‌డంతో ఆ త‌ల్లి గుండె ఉప్పొంగిపోయింది. 

Exit mobile version