అందాల ముద్దుగుమ్మ అనసూయ ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మొన్నటి వరకు యాంకర్‌గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగా సత్తా చాటుతుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా చిత్రాలలో తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొడుతుంది. ఇక వీలున్నప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రీసెంట్‌గా బికినీలో కూడా కనిపించి అందరికి పెద్ద షాకిచ్చింది అనసూయ. ఈ బ్యూటీ ఇద్దరు పిల్లల తల్లి అయిన కూడా ఇప్పటికీ చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది.
అయితే ఫ్యామిలీ, కెరియర్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న అనసూయ ఒకప్పుడు చాలా కష్టాలని అనుభవించిందట. ఈ విషయాలని ఓ ఇంటర్వ్యూలో సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పారు. ‘అలీ టాకీస్’ అనే షో చేసినప్పుడు అనసూయ పడ్డ కష్టాలు చెప్పుకొచ్చారు. ఎపిసోడ్ షూట్ కాగానే.. మరో ఎపిసోడ్ కోసం రాత్రి 7 గంటలకు వచ్చి అర్ధరాత్రి 1 గంట వరకు రిహార్సల్ చేసేదని.. ఆమె భర్త బయట కారులో వెయిట్ చేసేవారని ప్రసన్న కుమార్ తెలియజేశారు. కొత్త షో టెస్ట్ షూట్ కోసం అంతా ఫిక్స్ చేసుకున్నామని.. అయితే ఆ షూట్‌కి రెండు రోజుల ముందు అనసూయ డెలివరీ అయిందని, అయితే ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజు రెస్ట్ తీసుకొని మూడో రోజు షూట్‌కి వచ్చేసిందిని ప్రసన్న తెలియజేశాడు.
షూటింగ్‌లో పాల్గొంటూనే మధ్య మధ్యలో బేబికి ఫీడింగ్ ఇస్తూ యాంకరింగ్ చేసిందని అనసూయపై పొగడ్తల వర్షం కురిపించాడు ప్రసన్న కుమార్. ఇక షూటింగ్ కోసం ఇప్పటి వరకు అనసూయ డబ్బులు కూడా అడగలేదని ప్రసన్న కుమార్ తెలియజేశారు. వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అని ఆయన స్పష్టం చేశారు. అనసూయ అంత టఫ్ అమ్మాయిని తను ఇండస్ట్రీలో అస్సలు చూడలేదని, ఏ అబ్బాయి కూడా ఆమెని ఫ్లర్ట్ చేయలేడని, తన వెనకాల ఉన్న స్ట్రగుల్ తెలిసిన వారు బ్యాడ్ కామెంట్స్ చేయరని ప్రసన్న కుమార్ చెప్పారు. అనసూయ గురించి ప్రసన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.