చిన్న చిన్న వ్యాపారాలకు ఎలాంటి హామీ లేకుండానే రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకం కింద వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవారికి ఈ పథకం దోహదపడుతుంది. మహిళలకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి.
చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా తోడ్పాటు అందించడం , కనీస డాక్యుమెంట్లతో ఎలాంటి హామీ లేకుండానే రుణాలు ఇవ్వడమే ఈ స్కీమ్ ఉద్దేశం. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన ఆర్ధిక సంస్థ. సంప్రదాయంగా బ్యాంకులు ఇచ్చే రుణాలకు అనేక నిబంధనలు ఉంటాయి. అలాంటి రుణాలు పొందలేని వారికి కూడా ఆర్ధికంగా సాయం చేసేందుకు ఉద్దేశించిందే ముద్రా లోన్. వ్యక్తులు స్వంతంగా పరిశ్రమలు లేదా వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించడం, మహిళలు ఆర్ధికంగా సాధికారిత సాధించేందుకు పీఎంఎంవై స్కీమ్ కింద రుణాలు అందిస్తారు. వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ స్కీమ్ లక్ష్యం. స్టార్టప్ లేదా స్వంతంగా వ్యాపారం చేయాలనుకొనే యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. 2015 ఏప్రిల్ 8న ఈ పథకాన్ని మోడీ సర్కార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేది నాటికి ఈ స్కీమ్ ప్రారంభించి పదేళ్లు అయింది. ఈ పదేళ్లలో 33 లక్షల కోట్లు ముద్రా స్కీమ్ కింద అందించారు. ఇప్పటివరకు 53 కోట్ల మంది ఈ స్కీమ్ కింద వ్యాపారాలు ప్రారంభించారు. దీని కింద లబ్దిపొందిన వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు.
ముద్రాను నాలుగు విభాగాలుగా విభజించారు. అవి 1. శిశులోన్, 2.కిశోర్ లోన్, 3. తరుణ్ లోన్, 4. తరుణ్ ప్లస్ వ్యాపారాలు, లేదా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనేవారు తమ అవసరాలకు అనుగుణంగా ఆయా కేటగిరి కింద రుణాల కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.
1. శిశు రుణాలు : ఈ కేటగిరి కింద రూ. 50 వేల వరకు రుణం పొందవచ్చు. తోపుడుబండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసుకొనేవారికి ఇది ఉపయోగపడుతుంది.
2. కిశోర్ రుణాలు: ఈ కేటగిరి కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అప్పటికే ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసమే కాదు…. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
3. తరుణ్ రుణాలు: రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
4. తరుణ్ ప్లస్ రుణాలు: రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అయితే తరుణ్ స్కీమ్ కింద రూ. 10 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించినవారే తరుణ్ ప్లస్ లోన్ తీసుకొనేందుకు అర్హులు.
ఈ స్కీమ్ కింద ఎలాంటి హామీ లేకుండానే బ్యాంకు రుణం లభిస్తుంది. ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. మహిళలకు రాయితీలుంటాయి. ముద్రా డెబిట్ కార్డు సౌకర్యం కూడా ఉంది. దీని ద్వారా అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు. రుణాలపై సబ్సిడీ కూడా లభిస్తుంది.
గతంలో బ్యాంకు లోన్ తీసుకొని ఎగవేసినవారికి ముద్రాయోజన కింద లోన్ రాదు
ఏదైనా వ్యాపారం లేదా పరిశ్రమ నడుపుతూ ఉండాలి.. లేదా ప్రారంభించాలి.
ధరఖాస్తు చేసే వ్యక్తి వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రారంభించాలనకున్న వ్యాపారం లేదా పరిశ్రమకు సంబంధించిన అర్హతలు ఉండాలి.
ధరఖాస్తుదారుడికి బ్యాంకులను మోసం చేసిన చరిత్ర ఉండవద్దు
రెసిడెన్సీ సర్టిఫికెట్
గుర్తింపు కార్డు
కంపెనీ చిరునామా లేదా కంపెనీ గుర్తింపు పత్రం లేదా లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
కుల ధృవీకరణ పత్రం
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
కంపెనీ లేదా వ్యాపారసంస్థ ఆరు నెలల స్టేట్ మెంట్
ముద్రా యోజన అధికారిక వెబ్ సైట్ https://udyamimitra.in కు వెళ్లి ముద్రా లోన్ ఆఫ్షన్ ను ఎంచుకోవాలి.
ఇక్కడ కేటగిరిల్లో ఒక్క దాన్ని ఎంచుకోవాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నవారైతే కొత్త ఎంటర్ ప్రైన్యూర్ అని ఆఫ్షన్ క్లిక్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ అయితే దాన్ని ఎంపిక చేసుకోవాలి.
మీ ఫోన్ నెంబర్, ఈ మెయిల్ , పేరు ఇతర వివరాలు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
లోన్ అప్లికేషన్ సెంటర్ కు వెళ్లి లోన్ కేటగిరి (శిశు, కిశోర్, తరుణ్) లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి
అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి సబ్ మీట్ చేయాలి.
లేదా మీకు సమీపంలోని బ్యాంకుల్లో కూడా ముద్రా యోజన లోన్ ధరఖాస్తు ఫారాలు లభ్యమౌతాయి. ఈ ధరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి బ్యాంకులో అందించాలి.