Site icon vidhaatha

Anna Lezhneva| అన్నా లెజినోవాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో భ‌ర్త‌నా…గ‌తంలో ఆమెకి పెళ్లైందా.. మ‌రెన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Anna Lezhneva| పిఠాపురం నుండి దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఏపి మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయన‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని కీల‌క ప‌ద‌వులు అందించారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపుని అటు ఫ్యాన్స్, ఇటు కుటుంబ‌స‌భ్యులు గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స్థితికి చేర‌డం వెన‌క అన్నా లెజినోవా ఉన్నార‌ని ఆమె ఇచ్చిన స‌పోర్ట్‌తోనే ప‌వ‌న్ ఇంత విజ‌యం సాధించ‌గ‌లిగార‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంతో స‌పోర్ట్‌గా ఉన్న అన్న లెజినోవా హార‌తి ఇచ్చి వీర తిల‌కం దిద్ది మ‌రి ప్ర‌చారానికి పంపించ‌డం మ‌నం చూశాం. అలాగే గెలిచాక కూడా వీర‌తిల‌కం దిద్ది త‌న భ‌ర్త‌ని చూసి మ‌రిసిపోయింది. ఇక ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పులు చేతుల‌తో ప‌ట్టుకొని అంద‌రిచే శ‌భాష్ అనిపించుకుంది. ఇప్పుడు అంతా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు

1980లో రష్యాలో పుట్టిన అన్నా లెజినోవా యాక్టింగ్, మోడ‌లింగ్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి ‘తీన్మార్’ సినిమాలో న‌టించగా, ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింది. ఇక 2013 సెప్టెంబ‌ర్ 30న ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. అయితే అప్ప‌టికే అన్నా లెజినోవాకి పెళ్లి కాగా, ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అన్నా లెజినోవా ప‌వ‌న్ క‌ల్యాణ్ దంప‌తుల‌కి మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కుమారుడు జ‌న్మించాడు. అయితే అన్నా లెజినోవాకి ఫ‌స్ట్ భ‌ర్త‌తో ఒక కూతురు ఉండ‌గా, పాప పేరు పొలినా అంజ‌నా ప‌వ‌నోవా.ప‌వ‌న్ కళ్యాణ్ మొద‌ట నందినిని పెళ్లి చేసుకోగా, కొన్నాళ్ల‌కి ఆమెకి విడాకులు ఇచ్చాడు. త‌ర్వాత రేణూ దేశాయ్‌ని వివాహం చేసుకొని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చాడు. ఆ త‌ర్వాత ఆమెకి విడాకులు ఇచ్చి అన్నాలెజినోవాని పెళ్లి చేసుకున్నాడు.

పవన్‌తో పెళ్లికి ముందు అన్నాలెజినోవా.. హోట‌ల్ బిజినెస్ కూడా నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తుంది.. సింగపూర్ లో ఆమెకు హోట‌ల్ చైన్స్ ఉన్నాయ‌ట‌. ర‌ష్యా, సింగ‌పూర్ లో క‌లిపి ఆమెకు దాదాపు రూ.1800 కోట్లు విలువ‌ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో అన్నా లెజినోవా కూడా విడిపోయింద‌ని ఆ మ‌ధ్య బాగా ప్ర‌చారాలు జ‌రిగాయి. మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్ అయిన వ‌రుణ్ – లావ‌ణ్య పెళ్లి, అలానే క్లింకార బార‌సాల వేడుక‌ల్లో అన్నా లెజినోవా పెద్ద‌గా క‌నిపించ‌లేదు . ఆ క్ర‌మంలోనే వారు ఇద్ద‌రు విడిపోయార‌ని చాలా వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భార్య‌ని తీసుకొని మంగ‌ళగిరిలో ఓటు వేసేందుకు వెళ్లాడు. ఇక అప్ప‌టి నుండి ప్రతిసారి కూడా ప‌వ‌న్‌తోనే అన్నా లెజినోవా ఉంటుంది. చంద్ర‌బాబుని క‌లిసిన‌ప్పుడు, మోడీని క‌లిసేందుకు ఢిల్లీకి వెళ్లిన‌ప్పుడు, చిరంజీవి ఇంటికి వెళ్లిన‌ప్పుడు, ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మంలోను అన్నా లెజినోవా క‌నిపించి సంద‌డి చేసింది. ఈ ప‌రిణామాల‌తో ప‌వ‌న్, అన్నాల విడాకుల పుకార్లు ఉట్టి ప్ర‌చారాలుగా మిగిలిపోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే నేను అని ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో అన్నా లెజినోవా ముఖం వెయ్యి క్యాండిల్ బ‌ల్బులా వెలిగిపోవ‌డం మ‌నం చూశాం. త‌న భ‌ర్త‌కి అన్నా ఎంతో స‌పోర్ట్ అందిస్తుంద‌ని సంప్ర‌దాయ బ‌ద్దంగా చేయాల్సిన కొన్ని ప‌నుల‌ను చేస్తుందంటూ అన్నాని కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు.

Exit mobile version