Site icon vidhaatha

అమలాపురంలో అమీర్ ఖాన్

విధాత:బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నేడు అమలాపురంలో జరుగుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం బుధవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ చేరుకున్న ఆయన ఈరోజు అమలాపురంలో, శుక్ర శని వారాలలో కాకినాడ బీచ్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారు. శనివారం సాయంత్రం షూటింగ్ ముగించి తిరుగు ప్రయాణం అవనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్‌ బాలా పాత్రలో నటిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ త్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్‌ లొకేషన్స్‌లో పూర్తి చేశారు. బాలీవుడ్‌లో నాగ చైతన్య డెబ్యూ మూవీ కావడం విశేషం.

Exit mobile version