Aashi roy| రేవ్ పార్టీలో దొరికిన న‌టి ఆషి రాయ్.. హేమ గురించి అడిగితే ఏం చెప్పిందంటే..!

Aashi roy| బెంగ‌ళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టించ‌డం మ‌నం చూశాం.బర్త్ డే పార్టీ పేరుతో బిల్డర్, బుకీ అయిన వాసు బెంగ‌ళూరులో రేవ్ పార్టీ నిర్వహించ‌గా, ఈ పార్టీకి ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకు

  • Publish Date - May 23, 2024 / 08:30 AM IST

Aashi roy| బెంగ‌ళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టించ‌డం మ‌నం చూశాం.బర్త్ డే పార్టీ పేరుతో బిల్డర్, బుకీ అయిన వాసు బెంగ‌ళూరులో రేవ్ పార్టీ నిర్వహించ‌గా, ఈ పార్టీకి ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న బెంగుళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. న‌టి హేమ కూడా పార్టీలో పాల్గొంద‌ని పోలీసులు చెబుతుంటే తాను మాత్రం ఇంట్లోనే ఉన్నానంటుంది. అయితే టాలీవుడ్ యువ నటి ఆషి రాయ్ కూడా రేవ్ పార్టీలో దొర‌క‌గా, ఆమెని హేమ ఈ పార్టీలో పాల్గొందా లేదా అని అడ‌గ‌గా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

రేవ్ పార్టీలో పాల్గొన్న ఆషీ రాయ్ బ్ల‌డ్ శాంపిల్స్ ఇప్పటికే పోలీసులు సేక‌రించారు. అయితే ఈ సంఘ‌ట‌న గురించి ఆమె మాట్లాడుతూ.. ఇందులో నా త‌ప్పు ఏమి లేదు. బర్త్ డే పార్టీ అని ఇన్వైట్ చేశారు. పార్టీకి వెళ్ళాను. వాసు నాకు అన్నలాంటి వారు కాబ‌ట్టి పార్టీకి వెళ్లి కేక్ కట్ చేసి వచ్చేశాను. అంతకి మించి నాకు ఏమి తెలియదు. లోపల ఏం జరిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. నేను అమ్మాయిని. ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్నాను. ద‌యచేసి మీరంతా నాకు స‌పోర్ట్ చేయాలంటూ కోరింది ఆషి రాయ్. ఇక హేమ గురించి ఆమెని అడ‌గ‌గా, గ‌తంలో ఆమెని కొన్ని సార్లు క‌లిసాను. మ‌రీ అంత క్లోజ్ కాదు. పార్టీకి ఆమె హాజరైందా లేదా అనేది నాకు తెలియ‌దు అని స‌మాధానం ఇచ్చింది.

ఇక ఈ పార్టీలో పోలీసులు 45 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి మీరు ఏమంటారు అని అడగ్గా, ఈ విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పుకొచ్చింది. దాదాపు 100 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు వారిలో ఎవ‌రెవ‌రు డ్ర‌గ్స్ తీసుకున్నారు అనే దానిపై లోతుగా విచార‌ణ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌, కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ కూడా ఈ పార్టీకి వెళ్లార‌ని వార్త‌లు రాగా, వారు స్వ‌యంగా విడుద‌ల చేసి ఖండించారు.

Latest News