Aishwarya Rai| మోస్ట్ గాడ్జియస్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మిస్ ఇండియాగా టైటిల్ కైవసం చేసుకున్న ఐష్ సినిమాలలోను నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్యరాయ్‌కి ఎంత వీరాభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పలువురితో ప్రేమాయణం నడిపిన ఈ భామ 2007లో అభిషేక్ బచ్చన్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది.16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు, వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న దానిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
అయితే ఇలాంటి సమయంలో అభిషేక్, ఐశ్వర్యరాయ్ పెళ్లి సమయంలో జరిగిన సంఘటనకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి సమయంలో జాన్వీ కపూర్ తన చేయి కోసుకొని రచ్చ చేసిందట. వారి పెళ్లిలో జాన్వీ కపూర్ చేయి కోసుకోవడం ఏంటనే డౌట్ మీకు వచ్చింది కదా.. ఎక్కువగా ఆలోచించకండి. జాన్వీ కపూర్ అంటే .. శ్రీదేవి కూతురు జాన్వీ కాదు.. ఆమె ఓ మోడల్.. 2007లో వీళ్ల పెళ్లి జరుగుతున్నప్పుడే వాళ్ల ఇంటి బయట జాన్వీ కపూర్ అనే ఓ మోడల్ రచ్చ రచ్చ చేసింది. అభిషేక్ బచ్చన్ తో కలిసి దస్ మూవీలో నటించిన జాన్వీ కపూర్.. కేవలం పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ ఇదని చాలా మంది కొట్టి పారేశారు.
అభిషేక్ ఇల్లు ప్రతీక్షలో పెళ్లి జరుగుతున్న సమయంలో జాన్వీ పలు ఆరోపణలు చేసింది. అభిషేక్ తనని పెళ్లి చేసుకున్నాడని, న్యాయం కావాలంటూ చేయి కోసుకోవడం సంచలనం రేపింది. ఆమె అభిషేక్ పై జుహు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడానికి ప్రయత్నించినా.. ఆధారాలేవీ లేవంటూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. మొదట్లో ఆమె శాంతియుతంగా అభిషేక్ ఇంటిముందు ధర్నాకు దిగినా.. ఆమె తనపై చేసిన ఆరోపణలను అభిషేక్ ఖండించాడు. దీంతో జాన్వీ తన మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో పరిస్థితులు అదుపు తప్పాయి. అయితే జాన్వీని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా, ఆమె కోలుకున్న తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న కారణంతో ఐపీసీ సెక్షన్ 309 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రూ.10 వేల పూచీకత్తుపై రిలీజ్ చేశారు. వాళ్ల పెళ్లి తర్వాత జాన్వీ మళ్లీ ఎప్పుడూ అభిషేక్ ఇంటి ముందు కనిపించకపోగా.. ఆ తర్వాత కూడా అతనిపై ఎలాంటి ఆరోపణలు చేసింది లేదు.