మా మ‌స‌క‌బారింద‌ని నాగబాబు అన‌డం బాధించింది- న‌రేష్‌

హైదరాబాద్‌: ‘మా’ విషయంలో నాగబాబు మాటలు బాధించాయని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. ‘మా’ మసకబారిందన్న నాగబాబు వ్యాఖ్యలు తప్పని, అలా మాట్లాడటం ‘మా’ నిబంధనలకు ధిక్కరించినట్లేనని పేర్కొన్నారు. ‘మా’ కార్యవర్గంతో కలిసి నరేష్‌ మీడియాతో మాట్లాడారు. ‘మా’ అనేది రాజకీయ వ్యవస్థ కాదని చెప్పారు. ఎంతోమంది పెద్దలు ఇటుకా ఇటుకా పేర్చి ‘మా’ను ఏర్పాటు చేశారన్నారు. ‘మా’లో బీమా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘మా’ అసోసియేషన్‌కు తామంతా రాజీనామా చేస్తామని, తప్పుకోమంటే […]

  • Publish Date - June 26, 2021 / 07:41 AM IST

హైదరాబాద్‌: ‘మా’ విషయంలో నాగబాబు మాటలు బాధించాయని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. ‘మా’ మసకబారిందన్న నాగబాబు వ్యాఖ్యలు తప్పని, అలా మాట్లాడటం ‘మా’ నిబంధనలకు ధిక్కరించినట్లేనని పేర్కొన్నారు. ‘మా’ కార్యవర్గంతో కలిసి నరేష్‌ మీడియాతో మాట్లాడారు. ‘మా’ అనేది రాజకీయ వ్యవస్థ కాదని చెప్పారు. ఎంతోమంది పెద్దలు ఇటుకా ఇటుకా పేర్చి ‘మా’ను ఏర్పాటు చేశారన్నారు. ‘మా’లో బీమా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

‘మా’ అసోసియేషన్‌కు తామంతా రాజీనామా చేస్తామని, తప్పుకోమంటే ఇప్పుడే తప్పుకుంటామని నరేశ్‌ అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే తాను మద్దతిస్తానని చెప్పారు. సీనియర్‌ నటుడు కృష్ణంరాజును సంప్రదించిన తర్వాతే ప్రెస్‌మీట్‌ పెట్టామని, ‘మా’ ఒక దిగ్గజమని.. దానిని ఎవరూ కూల్చలేరని చెప్పారని వెల్లడించారు. ‘మా’ భవనంపై సీఎంని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. కార్యాలయ ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సభ్యుల ఆరోగ్యం కోసం కష్టపడుతుంటే ప్యానల్‌ ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

జీవితంలో అధ్యక్షుడివి కాలేనని నన్ను అన్నారని, అయినా ఒక మార్పు తేవాలని పోటీ చేసి గెలిచానని చెప్పారు. ఒక్కసారి మాత్రమే పోటీచేస్తానని తాను అప్పుడే చెప్పానన్నారు. ప్రకాశ్‌రాజ్‌ తనకు బంధు మిత్రుడని పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఫోన్‌చేసి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు చెప్పారన్నారు. మంచు విష్ణు కూడా పోటీలో ఉన్నారని తెలిపారు. ఏప్రిల్‌ 9న ప్రకాశ్‌రాజ్‌ ‘మా’కు లేఖ రాశారని, దానికి అదేనెల 12న సమాధానం ఇచ్చామన్నారు. ‘మా’ సభ్యులను చూసి ప్రకాశ్‌రాజ్‌ షాక్‌ అయ్యారని చెప్పారు.

ప్రస్తుతం ‘మా’లో 914 మంది జీవితకాల సభ్యులు, 29 మంది అసోసియేట్‌ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. 700 మంది సభ్యుల ఇంటింటికి వెళ్లి సర్వే చేశామన్నారు. 728 మందికి రూ.3 లక్షల చొప్పున జీవిత బీమా చేయించామని, 16 మంది చనిపోతే సుమారు రూ.50 లక్షలు అందించామన్నారు. 314 మందికి తొలిసారిగా వైద్య బీమా కల్పించామని తెలిపారు. ‘మా’ చరిత్రలో ఇంత మందికి ఎప్పుడైనా బీమా చేయించారా అని ప్రశ్నించారు. రూ.3 వేలుగా ఉన్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచామన్నారు. సీనియర్‌ నటుడు పొట్టి వీరయ్య చనిపోతే ఆయన కుమార్తెకు పింఛను బదిలీ చేశామని వెల్లడించారు. సభ్యత్వ నమోదు ఫీజును రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించామని, ‘మా’లో కొత్తగా 87 మందికి సభ్యత్వం ఇచ్చామన్నారు.

జాబ్‌ కమిటీ ద్వారా 35 మంది వృద్ధ కళాకారులకు సినిమాల్లో అవకాశాలు కల్పించామని తెలిపారు. కరోనా సమయంలో ‘మా’కు రూ.30 లక్షల విరాళాలు వచ్చాయని, సీసీసీకి లక్ష విరాళం ఇచ్చామని, చిరంజీవి అభినందించారని చెప్పారు. తాను కథలు చెప్పడం లేదని, కాగితాల్లో ఉన్నదే చెప్పానని వెల్లడించారు.

ReadMore:అమితా బచ్చన్ .. రజనీకాంత్ లోకలా

Latest News