Site icon vidhaatha

బైక్ రైడింగ్ చేయొద్దని సాయి తేజ్‌ను చాలా సార్లు హెచ్చరించాను

విధాత‌: ‘సాయి, మా అబ్బాయి నవీన్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నిన్న సాయంత్రం ఇక్కడి నుంచే వెళ్ళారు. నేను ఆ బైక్ సౌండ్స్ విని వెళ్ళేలోపే బయల్దేరిపోయారు. బైక్ రైడింగ్ చేయొద్దని సాయి తేజ్‌ను చాలా సార్లు హెచ్చరించాను. నేను ఎంత చెప్పినా నా మాటలు పట్టించుకోలేదు. తేజ్, మా అబ్బాయి కలిసి రైడింగ్ చేస్తారు. రైడింగ్‌పై ఇదివరకే ఇద్దర్నీ హెచ్చరించాను. తేజ్.. నా బిడ్డలాంటి వాడు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగులకి హాజరవుతాడని ఆ భగవంతుణ్ణి, మా అమ్మను కూడా ప్రార్ధిస్తున్నాను. నాలుగు రోజుల క్రితం కూడా వీరికి కౌన్సిలింగ్ చేద్దామని అనుకున్నాను. ఇద్దరూ మంచి వయసులో ఉన్నారు. పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు.. మంచి కెరీర్ ఉన్నవాళ్ళు. ఇలాంటి సమయంలో లైఫ్ రిస్క్‌లో పడేసుకోవడం మంచిదికాదు. సాయిని చూడటానికి ఆసుపత్రికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని రావట్లేదు. త్వరలో సాయి ధరమ్ తేజ్‌ని కలుసుకుంటాను’ అని నరేష్ తెలిపారు

Exit mobile version