విధాత: జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా పోటీ ఉంటే దాని ఫలితం వేరుగా ఉంటుందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మా ఎన్నికల్లో పోటీ తనతోనే మొదలైందని అన్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా, తమలో ఒకరే కదానని వ్యాఖ్యానించారు. ‘మా’ అసోసియేషన్‌కు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.